JNTUK News: జేఎన్టీయూకే గెస్ట్‌హౌస్‌లో శోభనం.. పూలపాన్పు, హడావుడి.. వైరల్‌గా మారిన వీడియోలు
యూనివర్సిటీ గెస్ట్ హౌజ్‌లో శోభనం జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. భవనంలోని ఓ గదిని శోభనం గదిలా మార్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయూకే గెస్ట్ హౌస్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఉన్నట్టుండి ఈ గెస్ట్ హౌస్ హనీమూన్ చేసుకొనే స్పాట్‌గా మారిపోయింది. వర్సిటీ గెస్ట్ హౌస్‌లో శోభనం జరుగుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. భవనంలోని ఓ గదిని శోభనం గదిలా మార్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నదానిపై కచ్చితమైన సమాచారం లేకపోయినా తాజాగా ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
నిబంధనలకు విరుద్ధంగా గెస్ట్ హౌజ్‌లో శోభన కార్యక్రమం చేసుకోవడానికి యూనివర్సిటీ యాజమాన్యం ఎలా అనుమతించిందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 18వ తేదీన ఉమెన్ ఎంపవర్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ స్వర్ణ కుమారి పేరుపై మూడు రూంలు బుక్ చేసినట్లు రిజిస్టర్‌లో నమోదై ఉంది. ఈ వీడియోలు బయటికి రావడంతో చదువుల తల్లి కొలువైఉన్న జేఎన్టీయూకే గెస్ట్ హౌస్.. ఓ ప్రొఫెసర్ నిర్వాకం వల్ల అపవిత్రం అయిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన వధూవరులకు తొలి రాత్రి అనుభవానికి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ వాడుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
బుక్ చేసిన రూమ్ నెంబర్ 201లో శోభనం ఏర్పాట్లు చేసి ఉన్నాయి. మంచంపై పులపాన్పు ఏర్పాటు చేశారు. గదిలో ఉన్న మంచంపై మల్లె పూలు చల్లి ముస్తాబు చేశారు. బయట అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలువురు హడావుడి చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ రాత్రి బంధుమిత్ర సపరివారంగా మొదటి రాత్రి వేడుకలు ఘనంగా జరిగాయని తెలుస్తోంది. అయితే, ఈ వీడియోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ప్రఖ్యాతిగాంచిన జేఎన్టీయూకే యూనివర్సిటీని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించడం పట్ల పలు ఉద్యోగ, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. చదువుల ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమాలు నిషిద్ధం కావడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలో కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ తెలిపారు.
Also Read: MP Arvind: కేసీఆర్ రెండో కొడుకు రేవంత్, అప్పటికల్లా సీఎం మనవడు ముసలోడు అయితడు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు