Janasena Song: ‘నమ్ముకుంటే అమ్ముకుంటివో సీఎం సారూ, అడుగుతుంటే నవ్వుతున్నవో’ జగన్‌పై జనసేన పాట విడుదల
‘సారు.. ఓ సీఎం సారు..’ అంటూ ఆ పాటను విడుదల చేశారు. పేద ప్రజల విషయంలో ఏపీ సీఎం జగన్ తీరును ఈ పాటలో వివరించారు.
![Janasena Song: ‘నమ్ముకుంటే అమ్ముకుంటివో సీఎం సారూ, అడుగుతుంటే నవ్వుతున్నవో’ జగన్‌పై జనసేన పాట విడుదల Janasena releases song on CM Jagan and YSRCP Janasena Song: ‘నమ్ముకుంటే అమ్ముకుంటివో సీఎం సారూ, అడుగుతుంటే నవ్వుతున్నవో’ జగన్‌పై జనసేన పాట విడుదల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/11/32f1c05aa50ad9bba0f886f1ac35518e1691762771383234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ ఓ పాటను విడుదల చేసింది. సీఎం పాలనపై విమర్శలు చేస్తూ ఈ పాట సాగింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తరచూ సీఎంపై చేసే విమర్శలు, ఆరోపణలతోనే ఈ పాట రాశారు. ‘సారు.. ఓ సీఎం సారు..’ అంటూ ఆ పాటను విడుదల చేశారు. పేద ప్రజల విషయంలో ఏపీ సీఎం జగన్ తీరును ఈ పాటలో వివరించారు. ఆ పాటలో ఉన్న విమర్శలు ఇవీ..
‘‘సారూ ఓ సారూ సారూ సీఎం సారూ. నిన్ను నమ్ముకుంటే అమ్ముకుంటివో ఓ సీఎం సారూ.. అడుగుతుంటే నవ్వుతున్నవో.. ఓ జగన్ గారూ. మా సొమ్ము దోచుకున్న నీకు ఉన్న ఇళ్లు ఎన్ని? బాధలెన్నో పెట్టి నువ్వు కొన్న భూములెన్ని? మా కడుపుకొట్టి కూడబెట్టుకున్న ఆస్తులెన్ని? నిన్ను నమ్ముకొని ఓటువేస్తిమో సీఎం సారూ.. తాచుపాములాగ కాటు వేస్తివో జగన్ గారు. చేసినము పొరపాటురో.. సీఎం సారు.. దించినావు పెద్ద పోటురో జగన్ గారు. రాయలసీమ గుండె పగిలి రగులుతుందిరా.. కోనసీమ కళ్లెర్ర చేసుకుందిరా.. ఉత్తరాంధ్ర ఉవ్వెత్తున ఉడికిపోయెరా..
కంటికి కనబడ్డవంటెరో ఓ జగను సారు.. ఇంటికి నిను పంపిస్తమురో ఓ సీఎం సారు. కంటపడితే వెంటబడతము ఓ సీఎం సారు.. ఇంటికి నిను పంపిస్తమురో ఓ సీఎం సారు. నీ పథకమొద్దు పాడు వద్దు.. పిచ్చిలేపె పనులు వద్దు.. నువ్వొద్దు నీపాలన అసలే వద్దు ఛల్.. ముందు నుంచి ముద్దులొద్దురో సీఎం సారు.. వెనక నుంచి గుద్దులొద్దురో జగన్ సారు.. ’’ అంటూ పాట సాగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)