అన్వేషించండి

Chandrababu: చంద్రబాబు వద్దకు ఈ ఇద్దరికి నో పర్మిషన్, వారి బొకేలు కూడా తీసుకోని సీఎం

CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు వివాదాస్పద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యూ కట్టారు. ఆయనను కలిసేందుకు వారికి పర్మీషన్ దక్కలేదు. దాంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు.

IAS,  IPS Officers Que to Meet CM Chandrababu : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ప్రమాణం చేశారు. వీరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా  సహా సినీ, రాజకీయ , ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు.   

బాధ్యతల స్వీకరణ
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. గురువారం సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో పండితుల మంత్రోచ్చారణల మధ్య  బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు ఉన్నారు.  సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

మెగా డీఎస్సీ పై మొదటి సంతకం 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ పత్రంపై మొదటి సంతకం చేశారు. (కేటగిరిల వారీగా : ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725;  టీజీటీ: 1781;  పీజీటీ: 286;  ప్రిన్సిపల్స్‌: 52) ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ క్యాలిక్యులేషన్ పై ఐదో సంతకం చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్ ల క్యూ
 చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సందర్భంగా సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం చాంబర్ వద్ద కోలాహలం నెలకొంది.  బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబును టీడీపీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ సమయంలో కాగా, కొందరు వివాదాస్పద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. వారిలో శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయులు ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే, చంద్రబాబును కలిసేందుకు వారికి పర్మీషన్ దక్కలేదు. దాంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు.  ఐఏఎస్ శ్రీలక్ష్మి గతంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పీఎస్సార్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో  ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. సునీల్ కుమార్ వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా పనిచేశారు.

వారి తీరు బాధించింది
గడచిన ఐదేళ్లలో కొందరు ఐఏఎస్ ల తీరు బాధించిందని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సచివాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. వారుఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. 1995 నుంచి పలు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. గడచిన ఐదేళ్లలో వారు వ్యవహరించిన తీరుపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. త్వరలోనే మరోసారి శాఖల వారీగా ఐఏఎస్, ఐపీఎస్ లతో సమావేశం అవుతానన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత  ప్రవీణ్‌ ప్రకాష్, శ్రీ లక్ష్మీ, పీఎస్ఆర్ ఆంజనేయులు అందించిన బొకేలను చంద్రబాబు తిరస్కరించినట్లు సమాచారం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నువ్వు అన్న ఏంట్రా.. ముసలోడివి! తాగి మనోజ్ రచ్చ!కత్తులు, గన్స్‌తో ఇంట్లోకి దొంగలు, కిలోలకొద్దీ బంగారం దోపిడీవిజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Embed widget