అన్వేషించండి

AP Weather Update: బలపడ్డ అల్పపీడనం, రేపు వాయుగుండంగా - ఈ 9 జిల్లాల్లో భారీ వర్షాలు: ఐఎండీ

వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం బలపడింది.

ఐఎండీ అధికారుల అంచనా ప్రకారం పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం బలపడింది. రేపు అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. తరువాత ఇది నెమ్మదిగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అన్నారు.

దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని అన్నారు. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు ఎల్లుండి నుంచి రెండు రోజు లపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. 

రేపు ఈ జిల్లాల్లోనే వర్షాలు
రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల  మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వివరించారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదని అన్నారు.

మంగళవారం రాత్రి 7 గంటల నాటికి అనకాపల్లి జిల్లా గొలుగొండలో 102 మి.మీ, విశాఖపట్నం రూరల్ లో 77.7 మి.మీ, విజయనగరం జిల్లా పెదనాడిపల్లె, 77 మి.మీ, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 75 మి.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా మూలపేటలో 70 మి.మీ, కృష్ణా జిల్లా పెడనలో 59.25 మి.మీ అధిక వర్షపాతం, 60 మి.మీ కన్న ఎక్కువ వర్షపాతం 10 ప్రాంతాల్లో నమోదైనట్లు తెలిపారు.

మరోవైపు, ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద రేపటి నుంచి పెరగనున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 39 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.76 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల సంస్థ ఎండీ డా. బిఆర్ అంబేడ్కర్ తెలిపారు. వర్ష ప్రభావంతో వరద ఉధృతి హెచ్చు తగ్గులుగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామని అన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఆరు బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget