అన్వేషించండి

AP CM Chandrababu: చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం వరాల జల్లులు- జీఎస్టీ మినహాయింపు, ఉచిత్ విద్యుత్‌ ప్రకటన

Good News for weavers | ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలిచింది. వారికి జీఎస్టీ మినహాయింపుతో పాటు ఉచిత విద్యుత్ అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

 GST exemption for Weavers in Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లులు కురిపించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి మద్దతుగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీ భారాన్ని ఇకపై ఏపీ ప్రభుత్వమే భరించనుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పన్ను మొత్తాన్ని కేంద్రానికి రాష్ట్రమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం చేనేత కార్మికులకు భారీ ఊరటను కలిగించనుంది.

రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు

ఏపీ సచివాలయంలో మంగళవారం జరిగిన చేనేత, జౌళిశాఖ సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటనలు చేశారు. చేనేత కార్మికుల భద్రత కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కీలక నిర్ణయాలన్నింటినీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 7వ తేదీ నుంచి అమలులోకి తేవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో తనను కలిసిన చేనేత కుటుంబాలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఏపీ చేనేత ఉత్పత్తులకు ఇటీవల 10 జాతీయ అవార్డులు లభించాయని గుర్తుచేశారు. అంతే కాకుండా "ఒకే జిల్లా – ఒకే ఉత్పత్తి" విభాగంలో రాష్ట్రానికి తొలిసారి అవార్డు లభించిందని అధికారులు వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత శాఖల అధికారులను అభినందించారు. వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో చేనేత రంగమే అత్యంత ప్రాధాన్యం కలిగిన రంగమని చంద్రబాబు పేర్కొన్నారు. 

1. చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్
2. చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం
3. రూ.5 కోట్లతో నేతన్నలకు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు.

ప్రసిద్ధి చెందిన ఒక చేతివృత్తి చేనేత

చేనేత ఒక ప్రముఖమైన కుటీర పరిశ్రమ. ఈ వృత్తికి అనేక కులాలవారు అనుబంధంగా ఉన్నారు. వీరిలో పద్మశాలీ, పట్టుశాలి, జాండ్ర, స్వకులసాలి, నేతకాని, దేవాంగ, తొగట, తొగటవీర క్షత్రియ, కైకాల, కుర్ణి, కర్ణ భక్తులు, కరికాల భక్తులు, నెస్సి, కురిమిచెట్టి, ముదలియార్, కత్రి, భవసార క్షత్రియ, నీలి, నీలకంఠ, సెంగుందంలు ముఖ్యమైనవారు. ఈ కులాల వారు చేనేత వృత్తిలో ఉన్నారు. 

చేనేతతో అనుసంధానంగా కొన్ని ఇతర చేతివృత్తులూ ఉన్నాయి. మగ్గం పై వర్క్ చేసే ప్రక్రియలో 2 ముఖ్యమైన దశలు 'పడుగు', 'పేక' ఉన్నాయి.. నిలువు దారాలను ‘పడుగు’ అని, పరస్పరం అడ్డంగా వెళ్లే దారాలను ‘పేక’ అంటారు. ఈ రెండు దారాలను మగ్గం ద్వారా కలిపే ప్రక్రియనే "నేత"గా పిలుస్తారు. దీన్ని చేతితో మగ్గం మీద చేయడం వల్ల దీనిని "చేనేత"గా వ్యవహరిస్తారు..

చేనేత ద్వారా తయారయ్యే వస్త్రాలు ప్రధానంగా మూడురకాల నేతల రూపంలో తయారవుతాయి. ఇవి చేనేత ఉత్పత్తుల మూల ఆధారాలుగా ఉంటాయి.

  1. సాదా నేత (Plain weave)

  2. శాటిన్ నేత (Satin weave)

  3. ట్విల్ నేత (Twill weave)

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget