అన్వేషించండి

Amaravati Latest News: అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన! ఉద్యోగులకు ఇళ్లు ఎప్పుడంటే?

Amaravati :అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మార్చి నాటికి అధికారులు, ఉద్యోగులకు ఇళ్లు ఇచ్చేస్తామని అన్నారు.

Amaravati construction progress :ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా అమ‌రావ‌తిని మూడేళ్ల‌లో కచ్చితంగా పూర్తిచేసి తీరుతామ‌ని మంత్రి నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. అస‌లు అమ‌రావ‌తిలో ప‌నులే జ‌ర‌గ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్న వారు క్షేత్ర‌స్థాయికి‌చ్చి చూడాల‌ని సూచించారు. రాజ‌ధాని నిర్మాణ ప‌నుల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన మంత్రి నారాయ‌ణ‌... శాఖ‌మూరు రిజ‌ర్వాయ‌ర్,కొండ‌వీటి వాగు,గ్రావిటీ కెనాల్తోపాటు అనంత‌వ‌రం పార్కు పనులు రివ్యూ చేశారు. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు మంత్రి.

"అమ‌రావ‌తిలో ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణానికి 2014-19 మ‌ధ్య‌లోనే టెండ‌ర్లు పూర్తి చేసి ప‌నులు కూడా ప్రారంభించాం. గ‌త ప్ర‌భుత్వం మూడుముక్క‌లాట‌తో మొత్తం నాశ‌నం చేసింది. అస‌లు రాజ‌ధాని ఎక్క‌డో క్లారిటీ ఇవ్వ‌లేదు. రైతుల‌ను అనేక ర‌కాలుగా ఇబ్బంది పెట్టింది. అయితే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గ‌తంలో ఉన్న టెండ‌ర్లు క్లోజ్ చేయ‌డంతోపాటు ఇత‌ర ఆర్ధిక అంశాల‌ను కొలిక్కి తీసుకొచ్చింది. పాత నిర్మాణాల‌పై ఐఐటీ నిపుణుల‌తో అధ్య‌య‌నం చేసి ముందుకెళ్తున్నాం" అని మంత్రి నారాయణ తెలిపారు.

Image

రాజధాని అమరావతిలో ప్ర‌స్తుతం అన్ని ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయని వివరించారు నారాయణ. ‌చ్చే ఏడాది మార్చి నెలాఖ‌రుకు అధికారులు, ఉద్యోగుల‌కు సంబంధించి 4 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామ‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో రోడ్లు,డ్రైనేజి‌నులు కూడా దాదాపు పూర్తి అయినట్టు చెప్పారాయ‌న‌ .అయితే లేఅవుట్ రోడ్ల డిజైన్లు మాత్రం ఈనెలాఖ‌రుకు ఐఐటీ నిపుణులు ఫైన‌ల్ చేస్తార‌ని అన్నారు.

Image

రాజ‌ధానిలో వ‌ర‌ద ముంపు నివార‌ణ కోసం కాలువ‌ల డిజైన్లు నెద‌ర్లాండ్స్ అధికారులతో చేయించామ‌న్నారు మంత్రి. "రాజ‌ధానిలో కొండ‌వీటి వాగు 23.6 కి.మీ. పాల‌వాగు 16.5 కి.మీ. గ్రావిటీ కెనాల్ను 7.843 కి.మీ.లు మొత్తంగా 47.94 కి.మీ. మేర కాలువ‌ల‌ను వెడ‌ల్పు చేసి లోతుగా తవ్వుతున్నాం. వీటితో పాటు శాఖ‌మూరు రిజ‌ర్వాయ‌ర్ను 0.03 టీఎంసీల కెపాసిటీతో 50 ఎక‌రాల్లో కృష్ణాయ‌పాలెం రిజ‌ర్వాయర్ను 0.1 టీఎంసీతో 190 ఎకరాల్లో అలాగే నీరుకొండ రిజ‌ర్వాయ‌ర్ను 0.4 టీఎంసీల కెపాసిటీతో 440 ఎక‌రాల్లో నిర్మిస్తున్న‌ాం" అని మంత్రి చెప్పారు. వ‌ర్షాల కార‌ణంగా కాలువ‌ల ప‌నులు కొంచెం నెమ్మ‌దిగా సాగుతున్నాయ‌ని అన్నారు. 2027 అక్టోబ‌ర్లోగా ఆయా ప‌నులు పూర్తిచేయాల‌ని టార్గెట్ పెట్టుకున్న‌ప్ప‌టికీ వ‌చ్చే ఏడాది చివ‌ర‌కు పూర్తి చేసేలా వేగంగా ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు.

రాజ‌ధానిపై కొన‌సాగుతున్న కుట్ర‌లు..

అమ‌రావ‌తిలో ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని కొంత‌మంది ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అమ‌రావ‌తిపై ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా మూడేళ్ల‌లో కచ్చితంగా పూర్తిచేసి తీరుతామ‌ని అన్నారు. బ్లూ- గ్రీన్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండేలా 30 శాతం ప‌చ్చ‌ద‌నానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌న్నారు. కృష్ణా రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్మెంట్ కూడా త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని... ట్రంక్ రోడ్లు ప‌నులు ఇప్ప‌టికే ప్రారంభం కాగా లేఅవుట్ రోడ్ల‌కు త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభిస్తామ‌న్నారు. రైతుల‌కు ఇచ్చిన రిట‌ర్న‌బుల్ ప్లాట్ల‌లో‌తంలో పాతిన‌రిహ‌ద్దు రాళ్లు తొల‌గిపోయాయ‌ని... తాజాగా ఆయా లేఅవుట్ల‌లో మౌళిక‌వ‌స‌తులు క‌ల్పించే కాంట్రాక్ట్ ఏజెన్సీలు స‌రిహ‌ద్దు రాళ్ల‌ను పాతుతాయ‌ని తెలిపారు.

900 మంది రైతుల‌కు కౌలు నిధులు పెండింగ్

రాజ‌ధానిలో సుమారు 25 వేల మందికిఏడాది కౌలు నిధులు‌మ చేయాల్సి ఉండ‌గా...నిన్న‌టి(సోమవారం)‌ర‌కూ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో 7 వేల మందికి‌మ కాలేద‌న్నారు. తాజాగా పెండింగ్లో ఉన్న నిధులు కూడా అకౌంట్ల‌లో జ‌మ అయ్యాయి. అయితే బ్యాంకు అకౌంట్ తప్పుగా ఉండ‌టం, కొంత‌మంది మ‌ర‌ణించ‌డం, మ‌రికొంత‌మంది భూమి అమ్ముకోవ‌డం వంటి కార‌ణాల‌తో 900 మందికి నిధులు జ‌మ‌కాలేద‌న్నారు. అటువంటి అకౌంట్ల‌ను మ‌రోసారి ప‌రిశీలిస్తున్న‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. కౌలు నిధులు జ‌మ‌కాని రైతులు వెబ్ సైట్లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని సూచించారు.

సీఎం చంద్ర‌బాబుపై సింగ‌పూర్ ప్ర‌భుత్వానికి న‌మ్మ‌కం

‌త ప్ర‌భుత్వం సింగ‌పూర్కు మ‌న సీఐడీ అధికారుల‌ను పంపించి వారిపై విచార‌ణ చేయించిందని దాంతో సింగ‌పూర్ ప్ర‌భుత్వం ఎంతో బాధ‌ప‌డిందన్నారు మంత్రి నారాయణ. "‌త ప్ర‌భుత్వ నిర్వాకంతో సింగ‌పూర్ - ఏపీ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. తిరిగిసంబంధాలు పున‌రుద్ద‌రించేందుకే సీఎం చంద్ర‌బాబు సింగ‌పూర్ వెళ్లారు. సీఎం చంద్ర‌బాబు సింగ‌పూర్ ప్రెసిడెంట్, సీనియ‌ర్ మంత్రుల‌ను క‌లిశారు. అన్ని విధాల స‌హ‌క‌రిస్తామ‌ని వారు చెప్పారు. ‌రిశ్ర‌మ‌ల పెద్ద‌ల‌ను క‌లిశారు. అధికారుల‌తో చ‌ర్చించ‌మ‌ని సీఎం ఆదేశించారు..

సింగ‌పూర్ నేష‌న‌ల్ పార్క్స్ అథారిటీ సీఆర్డీఏకు స‌పోర్ట్ చేస్తామ‌ని తెలిపారు. ‌ది రోజుల్లో అథారిటీ స‌భ్యులు అమ‌రావ‌తికి రానున్నారు. సీఎం చంద్ర‌బాబుపై సింగ‌పూర్ ప్ర‌భుత్వానికి ఎంతో న‌మ్మ‌కం ఉంద‌ని....కచ్చితంగా సింగ‌పూర్ సపోర్ట్ ఏపీకి ఉంటుంది" అని మంత్రి నారాయ‌ణ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget