No Change In Konaseema Name : కోనసీమ జిల్లా పేరు మార్చేది లేదన్న ప్రభుత్వం - దాడులపై పరస్పర ఆరోపణలు
కోనసీమ జిల్లా పేరు మార్చేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. అమలాపురంలో జరిగిన విధ్వంసం విషయంలో రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు ప్రారంభించాయి.
No Change In Konaseema Name : కోనసీమ జిల్లా పేరులో మార్పు ఉండబోదని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారికంగా ఇదే నిర్ణయం ప్రకటించారు. అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొన్ని సంఘవిద్రోహ శక్తులు అశాంతిని రేకేత్తించాయి. ఈ ఘటనలతో నేను సిగ్గుపడుతున్నానన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మీడియా ముందుకు రావాలి. వెనక ఉండి రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు. బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదు. పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దని పిల్లి సుభాష్ వ్యాఖ్యానించారు. కోనసీమ జిల్లా పేరును తొలగించలేదన్నారు. పేరు మార్చేది లేదని స్పష్టం చేశారు.
అదుపు తప్పిన కోనసీమ జిల్లా ఉద్యమం- నిరసనకారుల దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలు
అమలాపురం ఉద్రిక్తతలపై రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ ఆందోళనల వెనుక విపక్షాలు ఉన్నాయని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. తన ఇంటికి నిప్పు పెట్టడంపై ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఉద్దేశ్వపూర్వకంగానే చేశారని ఆరోపించారు. విధ్వంసం ఘటనపై విచారణ జరిపి నిందితులను బయటకు లాగుతామని హెచ్చరించారు. విధ్వంసం వెనుక పెద్ద కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. జిల్లాలపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం చెప్పలేదన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేదని పొన్నాడ సతీశ్ తెలిపారు.
ఎవరి కుట్రో తెలియడం లేదు - సజ్జల, హోంమంత్రి రియాక్షన్ !
పకడ్బందీగా విధ్వంసం చేశారని. టీడీపీ, జనసేన పార్టీల హస్తం ఉందని ఆరోపణలను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చేస్తున్నారు. దీన్ని జనసేన నేతలు ఖండిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తమపై రుద్దవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శాంతిభద్రతలు పర్యవేక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు.
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ప్రకటన
— JanaSena Party (@JanaSenaParty) May 24, 2022
•అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలి.
•ప్రజలందరూ సంయమనం పాటించాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
అగ్ని గుండంలా అమలాపురం- కొనసాగుతున్న విధ్వంసకాండ
కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదం.. ముందు ముదురాజకీయంగా పెను దుమారానికి కారణం అయ్యే అవకాశం కనిపిస్తోంది.