Sajjala And Home Minister Reaction : ఎవరి కుట్రో తెలియడం లేదు - సజ్జల, హోంమంత్రి రియాక్షన్ !
కోనసీమ జిల్లా పేరును అందరూ స్వాగతించారని ఎవరు ఆందోళనలు ప్రోత్సహిస్తున్నారో తెలియడం లేదని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని సలహాదారు సజ్జల కూడా తెలిపారు.
![Sajjala And Home Minister Reaction : ఎవరి కుట్రో తెలియడం లేదు - సజ్జల, హోంమంత్రి రియాక్షన్ ! Home Minister Taneti Vanitha said the name of Konaseema district was welcomed by all and it was not known who was promoting the Agitations Sajjala And Home Minister Reaction : ఎవరి కుట్రో తెలియడం లేదు - సజ్జల, హోంమంత్రి రియాక్షన్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/24/3b4051f5271c09d87e83202af053dcbf_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sajjala And Home Minister Reaction : అమలాపురంలో ( Amalapuram ) చెలరేగిన ఆందోళనలు, ఘర్షణలపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Adviser Sajjala ) స్పందించారు. పేరు మార్పు నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నది కాదన్నారు. అందరూ అంగీకరించిన తర్వాతనే పేరు మార్చామని ఇందులో వివాదం ఏమీ లేదన్నారు. శాంతి భద్రతల సమస్య ( Law And Order ) సృష్టించడం వెనుక ఎవరి కుట్ర ఉన్నదో తెలియడం లేదన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.
అదుపు తప్పిన కోనసీమ జిల్లా ఉద్యమం- నిరసనకారుల దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలు
అమలాపురం అల్లర్లపై హోంమంత్రి తానేటి వనిత ( Home minister ) కూడా స్పందించారు. కోనసీమ జిల్లా పేరు మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేశాయన్నారు. అందుకే ఈ మధ్యనే పేరు మార్చడం జరిగిందన్నారు. మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమన్నారు. కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని హోంమంత్రి వనిత ( Minister Vanita ) కోరారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
మంత్రి విశ్వరూప్ ఇల్లు బుగ్గి - కుటుంబం అలర్ట్ అవ్వకపోతే ...
20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారని... స్కూల్ బస్సు ల ను కూడా తగులబెట్టారని హోంమంత్రి ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయి...అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రకటించారు. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాననన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయని ప్రకటించారు. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను అదేశిస్తున్నాననని వీడియో విడుదల చేశారు.
జిల్లా పేరు మీద ఆందోళనలు, ఉద్రిక్తతలు, 144 సెక్షన్ విధింపు
విపక్ష పార్టీలు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టిస్తున్నారని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు చేస్తున్న కుట్రలని ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)