Kodali Nani In Apollo : అపోలో ఆస్పత్రిలో కొడాలి నాని - కిడ్నీ సమస్యకు ఆపరేషన్ !
మాజీ మంత్రి కొడాలి నాని కిడ్నీ సమస్యతో అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు.
Kodali Nani In Apollo : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యంతో ఆస్పత్రిలోచారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆస్పత్రిలో చేరి నాలుగు రోజులు అవుతోందని తెలుస్తోంది. శుక్రవారం ఆయనకు కిడ్నీ ఆపరేషన్ జరిగినట్లుగా చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే అయనకు ట్రీట్‌మెంట్ మాత్రం తర్వాత కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం చేసిన ఆపరేషన్ ప్రాథమికమైనదని.. రెండు, మూడు వారాల తర్వాత మరో కీలక ఆపరేషన్ చేయాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తారు. ఆ తర్వాత రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి . ఆ తర్వాత శరీరం సహకరిస్తే.. కిడ్నీలకు లేజర్ ఆపరేషన్ చేసే చాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని
కొడాలి నానికి మొదటి నుంచి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. నాలుగు రోజుల కిందట తీవ్రం కావడం... ఒళ్లంతా వాపు వచ్చినట్లుగా అవడంతో పాటు కొడాలి నాని నొప్పి భరించలేకపోవడంతో.. కుటుంబసభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు ఆపరేషన్ పూర్తయిన తర్వాతే.. ఆస్పత్రిలో చేరినట్లుగా బయటకు తెలిసింది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా మంది సహజమే కానీ.. అలాంటి సమస్య వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత అలవాట్లు మానుకోవడం.. గుట్కా, మాంసాహారానకి దూరంగా ఉండటంతో పాటు క్రమబద్దమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. లేకపోతే కిడ్నీలో రాళ్లు మళ్లీ పెరగుతారు. పనితీరు మందగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నాలుగు రోజుల కిదంటే చేరిక - ఆలస్యంగా వెలుగులోకి
రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండే కొడాలి నాని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్య తీవ్రం అయినట్లుగా భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మొత్తం గోప్యత పాటిస్తున్నారు. అయితే సమస్య చిన్నదేనని.. నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్దదయిందని.. ఆందోళన చెందాల్సిందేమీ లేదని కొడాలి నాని సన్నిహితులుచెబుతున్నారు. అభిమానులు ఆందోళన చెందుతారనే .. ఇప్పటి వరకూ కొడాలి నాని ఆస్పత్రిలో చేరిన విషయం బయటకు చెప్పలేదని అంటున్నారు. కొడాలి నాని ఆరోగ్యంపై వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకంటున్నట్లుగా తెలుస్తోంది.
కొడాలి నాని ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదన్న అనుచరులు
టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన కొడాలి నాని వైఎస్ఆర్‌సీపీలో చేరి మంత్రిగా పని చేశారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి పోయింది. అయితే ప్రాంతీయ సమన్వయకర్తగా ఆయనకు పదవి ఇచ్చారు. టీడీపీపై విరుచుకుపడే వైఎస్ఆర్‌సీపీ నేతలల్లో ఆయనది ముఖ్య స్థానం. అందుకే వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమే - విజయసాయిరెడ్డి బంధువులు, సన్నిహితులే పాలకులు !