అన్వేషించండి

Vijay victory credit to Jagan: జగన్ ఫోటోతోనే విజయ్ గెలిచారా? వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రచారం కరెక్టేనా?

Vijay And Jagan: తమిళనాడులో విజయ్ గెలుపు క్రెడిట్ జగన్ ఖాతాలో వేస్తున్నారు వైసీపీ ఫ్యాన్స్. జగన్ ఫోటో చూపించి ఎన్నికల్లో గెలిచారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Vijay win with Jagan photo:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ ప్రభంజనం సృష్టించి, తన పార్టీ టీవీకేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టారు. అయితే, ఈ విజయంపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్ మొదటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారని, జగన్ ఫోటోతో ప్రచారం చేయడం వల్లే ఆయనకు ఈ స్థాయి విజయం దక్కిందని ఆమె పేర్కొనారు.  తమిళనాడు ఎన్నికల్లో  డీఎంకే తరఫున ప్రచారం చేసిన రోజా, ఫలితాలు రాగానే విజయ్‌ను ఆకాశానికెత్తడంపై నెటిజన్లు ప్లేట్ మార్చేశారంటూ  విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆ రెండు సెకన్ల వీడియోనే అసలు కథా? 

నిజానికి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విజయ్ ఎక్కడా జగన్ ఫోటోను అధికారికంగా వాడలేదు. ఒక రోడ్ షో సందర్భంగా అభిమాని ఒకరు జగన్, విజయ్ కలిసి ఉన్న ఫోటోను అందించగా, దాన్ని ఆయన ఒక్క క్షణం పైకి ఎత్తి చూపించి తిరిగి ఇచ్చేశారు. ఆ రెండు సెకన్ల నాటి పాత దృశ్యాలను పట్టుకుని, విజయ్ గెలుపుకు జగన్ ఇమేజే కారణమని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రం గెలుపు క్రెడిట్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలనే తపనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

నాడు డీఎంకే.. నేడు టీవీకే: రోజా యూ-టర్న్! 

ఎన్నికల సమయంలో తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గెలుపు కోసం ప్రచారం చేసిన రోజా, ఇప్పుడు విజయ్ వైపు మొగ్గు చూపడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగన్ లాగే విజయ్ కూడా ఒంటరి పోరాటం చేశారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, డీఎంకేతో మిత్రపక్షంగా ఉన్న వైసీపీ నేతలు, ఇప్పుడు ఆ పార్టీని ఓడించిన విజయ్‌ను పొగడటం వెనుక ఉన్న రాజకీయ మతలబు ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  

 విజయ్ సొంత బ్రాండ్ వర్సెస్ వైసీపీ ప్రచారం 

విజయ్ తన సొంత సినిమా గ్లామర్, క్షేత్రస్థాయిలో చేసిన కేడర్ బిల్డింగ్,  డ్రవిడ రాజకీయాల్లో మార్పు కోరుకున్న యువత మద్దతుతో విజయం సాధించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు ఈ గెలుపును తమ నాయకుడికి ఆపాదించడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వినిపిస్తున్నాయి.  విజయ్ గెలిచింది ఆయన కష్టంతో, కానీ సంబరాలు మాత్రం తాడేపల్లిలో జరుగుతున్నాయా  అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మిన్నంటుతున్నాయి.      

 క్రెడిట్ వార్‌పై పెదవి విరుపు 
 
పక్క రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి పుట్టుకొస్తే, దానికి తమ నాయకుడే స్ఫూర్తి అని చెప్పుకోవడం ఇప్పుడు వైసీపీ నేతలకు రివాజుగా మారింది. గతంలో కూడా ఇతర రాష్ట్రాల ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసిన నేతలు, ఇప్పుడు విజయ్ విజయంపై చేస్తున్న వ్యాఖ్యలు వారిని విమర్శల పాలు చేస్తున్నాయి. అధికారం శాశ్వతం కాదని, ప్రజాభిప్రాయమే అంతిమ తీర్పు అని విజయ్ నిరూపిస్తే, ఆ క్రెడిట్‌ను హైజాక్ చేయడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget