Jagan DGP Meet : పోలీసులు, ఇంటలిజెన్స్ వైఫల్యంపై సీఎం జగన్ సీరియస్.. అరగంట పాటు వివరణ ఇచ్చిన డీజీపీ ?
చలో విజయవాడకు పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలి రావడంపై సీఎం జగన్‌కు డీజీపీ సవాంగ్ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అరగంట పాటు వీరి మధ్య సమావేశం జరిగింది.
పీఆర్సీ సాధన సమితి నిర్వహించిన చలో విజయవాడ విజయవంతం కావడం పట్ల ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఈ అంశంపై సీఎం జగన్ మోహన్ రెడ్డితో డీజీపీ గౌతం సవాంగ్ శుక్రవారం భేటీ అయ్యారు. సుమారు అర గంట పాటు జరిగిన భేటీలో చలో విజయవాడ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసు నిర్భందాలు, ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై డీజీపీని సీఎం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై చర్చించినట్లు సమాచారం. దీనికి బాధ్యులెవరో ఐడెంటిఫై చేయాలని జగన్ ఆదేశించినట్లుగా తెలు్సతోంది.
ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలి.. ఏపీ ఉద్యోగ నేతల డిమాండ్ !
ఇంటలిజెన్స్ వైఫల్యంపైనా సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడకు చాలా తక్కువ మంది వస్తారని ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. అందుకు విరుద్దంగా సుమారు 4 కిలోమీటర్ల మేర ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు నిమిషాల వ్యవధిలోనే ఉద్యోగులతో నిండిపోయింది. ఈ పరిణామాలన్నీ ఎలా జరిగాయనే అంశంపైనా డీజీపీని సీఎం వివరణ అడిగినట్లు తెలిసింది. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వ ఓ అంచనాకు వచ్చింది.
తగ్గని ప్రభుత్వం - పట్టు వీడని ఉద్యోగులు ! సమ్మె ఖాయం.. తర్వాత ఏంటి ?
ఇంటెలిజన్స్, నిఘా వ్యవస్థ పనితీరుపైనా చర్చించినట్లు తెలిసింది. ఛలో విజయవాడను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలను సీఎంకు డీజీపీ సమగ్రంగా వివరించినట్లు సమాచారం. ఉద్యోగులు మారువేషాల్లో రావడం, ముందే విజయవాడ చేరుకుని బస చేయడం లాంటి వ్యూహాలను పాటించారని ఆ విషయాలను పోలీసులు అంచనా వేయలేకపోయారన్నారు. ఉద్యోగుల ఉద్యమం తీవ్రమవుతున్న దశలో భవిష్యత్తులో ఎలా వ్యవహించాలనే విషయంపై ముఖ్యమంమత్రి జగన్ డీజీపీకి సూచనలు చేసినట్లు తెలిసింది.
ఏపీ ఉద్యోగుల పెన్‌డౌన్ స్టార్ట్.. చర్చలకు రావాలని మళ్లీ ప్రభుత్వం పిలుపు !
సోమవారం నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అయితే ఉద్యోగులకు కింది స్థాయి పోలీసు సిబ్బంది సహకరిస్తున్నారన్న ప్రచారం కారణంగా ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది. అలా జరగకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అందుకే పోలీసు యంత్రాంగంపై పూర్తి స్థాయి పట్టు ఉండాలని డీజీపీకి సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చలో విజయవాడను గ్రాండ్ సక్సెస్ చేసి ఉద్యోగులు ప్రభుత్వంలో ఆందోళన కల్పించారని భావిస్తున్నారు.