Employees Leaders : ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలి.. ఏపీ ఉద్యోగ నేతల డిమాండ్ !

చర్చల పేరుతో హడావుడి చేస్తున్న ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలని ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

FOLLOW US: 


ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలపై చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఉద్యోగ సంఘ నేతలను ఉద్దేశించి సీఎస్ చేసిన దొంగ బాబాల కామెంట్లపై మండిపడ్డ పీఆర్సీ సాధన సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  దొంగ బాబా అనే పదానికి డిక్షనరీలో అర్ధం వెతికితే సమీర్ శర్మ పేరే వస్తుందేమోనని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడానికి సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులదే బాధ్యతని విమర్శించారు. రైల్వేలో ఉద్యోగం చేసుకునే సత్యనారాయణ ఇక్కడికొచ్చి మా జీతాలు లెక్కల వేయడం దురదృష్టకరమని అన్నారు. 

ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం అని ఏ డిక్షనరీలో ఉంది : సూర్యనారాయణ

ఇప్పుడు పదే పదే చెబుతున్నా సీఎస్ సమీర్ శర్మ సమ్మె నోటీసివ్వడానికి వెళ్లినప్పుడు ఎందుకు చర్చించ లేదు... నోటీసు ఇచ్చిన రోజునే సమ్మెకు వెళ్లవద్దని  సీఎస్ ఎందుకు మాతో మాట్లాడలేదని ప్రశ్నించారు.  ఐఆర్ అంటే ఇంట్రస్ట్ ఫ్రీ లోన్ అని ఏ డిక్షనరీలో ఉందో చెప్పాలని సీఎస్ సమీర్ శర్మను సూర్యనారాయణ డిమాండ్ చేశారు.  ఐఆర్ అంటే మధ్యంతర ఉపశమనం అని డిక్షనరీల్లో ఉంది. ఉపశమనం కింద ఇచ్చిన డబ్బులను రికవరీ ఎలా చేస్తారో అర్దం కావడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోల్లో ఐఆర్ నుంచి రికవరీ చేయమని స్పష్టంగా పేర్కొన్నారని సూర్యనారాయణ జీవోలు చూపించారు. హైకోర్టు ఉద్యోగులు, జిల్లా కోర్టుల ఉద్యోగులు పీఆర్సీ సాధన సమితితో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారు. కోర్టు ఉద్యోగులు ఉద్యమంలోకి రావడం ఓ చరిత్ర అన్నారు. 

శశిభూషణ్‌కు పిచ్చి పట్టిందా ? మాకా ? :  బండి శ్రీనివాసరావు
 
ప్రభుత్వం ఏ పద్దతిలో పీఆర్సీ ఫిక్స్ చేసిందని మరో ఉద్యోగ నేత బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు.  ఇన్నాళ్లూ రకరకాల కమిటీలంటున్నారు.. ఇప్పుడు ఎనామలీస్ కమిటీ అంటున్నారు. ఎనామలీస్ కమిటీ ఏంటో.. ఆయనెక్కడున్నారో వెతుక్కోవాలా.. అని అని మండిపడ్డారు.  సీఎస్ సమీర్ శర్మ కేంద్ర సర్వీసుల్లో చేసి వచ్చారు కాబట్టి.. ఏపీలో అవలంభించే విధానం తెలీదనుకుంటానని సెటైర్ వేశారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణుకు పిచ్చి పట్టిందో.. మాకు పిచ్చి పట్టిందో అర్ధం కావడం లేదని.. వందేళ్ల క్రితం ఎప్పుడో ఆప్షన్ తీసుకునే విధానం ఉందని శశిభూషణ్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. మేమన్నా బ్రిటీష్ కాలంలో పని చేసిన వాళ్లమా..? ఆప్షన్ విషయంలో గత పీఆర్సీలు అవలంభించిన విధానం శశిభూషణ్ పరిశీలించాలని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖలో ఉద్యమంలో ఉండగా బదిలీలు చేస్తున్నారని..  బదిలీల జీవోను నిలుపుదల చేయకుంటే అత్యవసర సేవలనూ నిలిపేస్తామని బండి శ్రీనివాసరావు  హెచ్చరిచారు. 

జీతాలు తగ్గిన విషయం తెలుసుకోలేనంత అమాయకులమా ?: వెంకట్రామిరెడ్డి 

ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం అని సీఎస్ సమీర్ శర్మ అనడం చాలా బాధాకరమని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానంచారు.  మా జీతాన్ని కూడా అప్పుగానే భావిస్తారా .. పీఆర్సీకి డీఏలకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు.  సీనియర్ అసిస్టెంట్ హోదాలో వివిధ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగికి కొత్త పీఆర్సీ వల్ల రూ. 2900 నుంచి  రూ. 500 మేర తగ్గింది.డీఏల కలిపిన తర్వాత కూడా సీనియర్ అసిస్టెంట్ హోదాలో వివిధ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగికి కొత్త పీఆర్సీ వల్ల రూ. 1700 నుంచి  రూ. 1400 మేర తగ్గిందని వెంకట్రామిరెడ్డి లెక్క చెప్పారు.  ఇప్పటికైనా సీఎం వాస్తవాలు గుర్తించాలి.. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారో గమనించాలని సూచించారు. 

ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలి : బొప్పరాజు 

పీఆర్సీ విషయంలో మాతో బహిరంగ చర్చలకు ప్రభుత్వం సిద్దమా అని బొప్పరాజు వెంకటేశ్వర్లు సవాల్ చేశారు. చర్చల్లో ఏం చెప్పడం లేదు.. ఛాయ్ బిస్కెట్టులు పెట్టి పంపుతున్నారని.. చర్చల్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలని.. అందుకే బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. మేం సమ్మెకి వెళ్తే జీతాల డబ్బులని మిగుల్చుకోవచ్చనేది ప్రభుత్వ కుట్రచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఓపెన్ మైండుతో చర్చలకు రావాలన్నారు. పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వాలని మేం కోరితే.. ఇస్తామని చెప్పిన మంత్రుల కమిటీ.. ఎందుకు నివేదిక ఇవ్వలేదనిప్రశ్నించారు.  పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదని.. మీ గడపలు చుట్టూ తిరిగితే లొంగి ఉన్నట్టు.. ప్రశ్నిస్తే బల ప్రదర్శన చేసినట్టా అని మండిపడ్డారు. 

న్యాయశాఖ ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి ఉద్యమంలోకి !

అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక విడుదల చేసి స్వయంగా సీఎం చర్చలు జరపాలని మేం చాలా రోజుల క్రితం కోరామని న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధి వేణుగోపాల్ తెలిపార. ఇదేమీ భట్టిప్రోలు పంచాయతీ కాదన్నారు.  నీళ్లల్లో దున్నపోతును పెట్టి అమ్మకానికి పెట్టినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. కారణాలేదైనా జీవోలు సరిగా ఇవ్వలేదని నిన్నటి ఛలో విజయవాడ కార్యక్రమం తర్వాతైనా ప్రభుత్వానికి అర్ధం కావాలి కదా అని ప్రశ్నించారు.  న్యాయ శాఖలోని వివిధ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడుతున్నాం.. బుధవారం సమావేెశం అవుతున్నామని తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకుంటామన్నారు. 

 

Published at : 04 Feb 2022 04:12 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan AP government AP PRC AP Employees Strike PRC Dispute AP Employees Movement ESMA on AP Employees

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: నట్టి క్రాంతి, నట్టి కరుణపై పంజాగుట్ట పీఎస్‌లో RGV ఫిర్యాదు

Breaking News Live Updates: నట్టి క్రాంతి, నట్టి కరుణపై పంజాగుట్ట పీఎస్‌లో RGV ఫిర్యాదు

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

NTR Centenary Celebrations : పురోహితునిగా ఎన్టీఆర్ - సినిమాలో కాదు నిజంగా !

NTR Centenary Celebrations :  పురోహితునిగా ఎన్టీఆర్ - సినిమాలో కాదు నిజంగా !

Balakrishna About NTR: ఎన్టీఆర్‌కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం

Balakrishna About NTR: ఎన్టీఆర్‌కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

Chiranjeevi - Rajendraprasad Tribute To NTR: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్ 

Chiranjeevi - Rajendraprasad Tribute To NTR: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్ 

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి