By: ABP Desam | Updated at : 27 Dec 2021 07:41 PM (IST)
వైద్య ఆరోగ్య శాఖపై జగన్ సమీక్ష
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడి కోసం సీఎం జగన్ ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధంగా ఉండాలని సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌పై అధికారులు జగన్‌కు నివేదిక అందిచారు. 13 జిల్లాల్లో 98.96శాతం మొదటి డోస్ ..71.76శాతం రెండో డోస్ వేసినట్లుగా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ ప్రకటించినందున దాని అన్ని రకాలుగా సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్ డోస్ అవసరమని ప్రాథమిక అంచనావేశామని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 6 ఒమిక్రాన్ కేసులున్నాయని వీరిలో ఎవ్వరూ ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి రాలేదన్నారు. అధికారులు ఇచ్చిన వివరాలు ప్రకారం భయాందోళన అవసరంలేదని.. అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాలనుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు. టెస్ట్ ఎర్లీ, ట్రేస్ ఎర్లీ, ట్రీట్ ఎర్లీ పద్దతిలో అధికారులు ముందుకు వెళ్లాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలని..వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామని సీఎం సూచించారు.
Also Read: సినిమా టికెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఐఆర్సీటీసీ తరహాలో ఏపీఎఫ్‌డీసీకు బాధ్యతలు అప్పగింత....
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు పనుల ప్రగతిని కూడా సీఎం తెలుసుకున్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల్‌కళాశాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఇవి పూర్తయితే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మెడికల్ సీట్లు పెరగడమే కాదు.. మంచి వైద్యంకూడా అందుబాటులోకి వస్తుందని ఒక ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు. ఒకవైపు నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ఆస్పత్రులను ఆధునీకరించడం, ఇప్పటికే ఉన్న 11 బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు, ఈ కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాలనూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవరం ఉందన్నారు.
Also Read: ఏపీలో కొనసాగుతున్న సినిమా కష్టాలు... రేపు మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్ల భేటీ...
మెడికల్ హబ్స్ ఏర్పాటును వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రయివేటు రంగంలోకూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు రావాలన్నదే ఈ హబ్స్ ఉద్దేశమని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో జనరల్ బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలి.. ఆ లోగా కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన
రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే
Tirupati News: శ్రీసిటీని సందర్శించిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, వివరాలు ఇలా!
AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్
TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?