By: ABP Desam | Updated at : 11 Nov 2021 03:47 PM (IST)
వర్షాలపై సీఎం జగన్ సమీక్ష
వర్షాలపై సీఎం జగన్ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేశారు సీఎం జగన్. నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేటతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని.. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చెప్పారు.
బాధితులకు ఏం కావాలన్నా.. వెంటనే అడగాలని సీఎం అన్నారు. శిబిరాల్లో వారికి మంచి ఆహారం అందించాలని చెప్పారు. బాధితులకు రూ.వెయ్యి చొప్పున పరిహారం అందించాలని సీఎం సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించేందుకు చర్యలు చేపట్టాలన్న సీఎం.. అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవాలన్నారు. మందులను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్యం విషయంలోనూ చర్యలు తీసుకోవాలలి సీఎం చెప్పారు.
అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్లను సీద్ధంగా ఉంచాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని, యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు
వాయుగుండం ఎఫెక్ట్ తో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి..నిన్న అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జనజీవనం పూర్తిగా అస్థవ్యస్థం మారింది.. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో చంద్రగిరి సమీపంలోని అమ్మచెరువు ప్రమదకర స్ధితిలోకి చేరింది.. దీంతో లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి ఐదేళ్ళ తరువాత మల్లెమడుగు రిజర్వాయర్, చైతన్యపురం చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఆధ్యాత్మిక నగరి తిరుపతి నగరంలోని మాధురానగర్ లో పలు ఇళ్ళలోకి వర్షపు నీరు చేరుకోవడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. డీఆర్ మహల్, వెస్ట్ రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద భారీ వర్షపు నీరు నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. నగర మేయర్ శిరీషా, కమిషనర్ పీఎస్ గిరీషా డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ను వెంట తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలతో స్థానిక వెస్ట్ చర్చ్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహంలో వాహనం చిక్కుకుని బెంగుళూరుకు చెందిన ఓ నవ వధువు మృతి చెందిన కారణంగా.. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని అండర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. నగరంలో మిగిలిన లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని నగర పాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ పీఎస్ గిరీషాతో భూమన సమీక్షించారు. ప్రజలను వేంటనే అప్రమత్తం చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కుపై సమీక్ష
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సీఎం జగన్ సమీక్ష చేశారు. లబ్ధిదారులకు క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అనుమతి ఇవ్వాలన్నారు. పథకం అమలుపై కింది స్థాయి అధికారులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం జగన్ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు నవంబర్ 20 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని సీఎం చెప్పారు. డిసెంబర్ 15 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. 52 లక్షల మంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. 45.63 లక్షల మంది లబ్ధిదారుల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్ చేశామన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం సరైనన్ని స్టాంపు పేపర్లను తెప్పించుకున్నామన్నారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ కు అధికారులు వివరించారు.
Also Read: Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
East Godavari News : విహారయాత్రలో విషాదం, గోదావరిలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు శుభవార్త, రేపు భారీగా ఆర్జిత సేవా టికెట్లు విడుదల
AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
Breaking News Live Telugu Updates: ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు
Atmakur Bypoll Result: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ విజయం, మెజారిటీ ఎంతంటే
India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్ ఎవరు?
Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?
PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన
T Hub Pics: టీ హబ్ 2.0 రెడీ, అబ్బురపరిచే నిర్మాణ శైలి! గాల్లోనే ఎక్కువ భాగం బిల్డింగ్ - ప్రారంభం ఎప్పుడంటే