అన్వేషించండి

CM Jagan Review: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష... పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఆరా... ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఆరా తీశారు. వెలుగొండ, తాండవ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

జలవనరులశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. దిగువ కాపర్‌ డ్యాం పనులు, కెనాల్స్‌కు కనెక్టివిటీ తదితర అంశాలపై సమావేశంలో  చర్చజరిగింది. ఆర్‌ అండ్‌ ఆర్ ‌పనులు, కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన నిధులకు సంబంధించి వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన సొమ్ము రూ.2033 కోట్లకు పైనే ఉందన్నారు. కేంద్రం నుంచి ఈ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ అయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని అధికారులకు తెలిపారు. గ్యాప్‌ 3 కాంక్రీట్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేశామని అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే ఖరీప్‌ కు కాల్వల ద్వారా నీరందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

Also Read: బద్వేలు నామినేషన్లు ప్రారంభం ! బీజేపీ -జనసేన అభ్యర్థి ఎవరు ?


CM Jagan Review: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష... పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఆరా... ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

వచ్చే ఆగస్టుకు అవుకు టన్నెల్ పూర్తి

దిగువ కాపర్‌ డ్యామ్‌ పనులను నవంబరు నాటికి పూర్తి చేసి, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పనులను ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఇతర ప్రాజెక్టుల ప్రగతిపై సీఎం ఆరా తీశారు. నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమని వెల్లడించారు. అవుకు టన్నెల్‌ నిర్మాణ పనుల్లో గణనీయ ప్రగతి సాధించామన్నారు. ఫాల్ట్‌జోన్‌లో తవ్వకాలు జరిపి, పటిష్టపరిచే కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు నాటికి టన్నెల్‌ పూర్తిచేసి ఆ టన్నెల్‌ ద్వారా నీటిని ఇవ్వగలుగుతామన్నారు. పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పనుల్లో ఆలసత్వం వద్దని సూచించారు. 

Also Read: అనంత టీడీపీలో మరోసారి కలకలం.. తాడిపత్రిలోకి ప్రభాకర్ చౌదరి ఎంట్రీ !

వెలిగొండ ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై సీఎం  జగన్ సమీక్షించారు. రెండో టన్నెల్‌ పనుల వేగం పెంచాలని ఆదేశించారు. వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌ –2 పనులన్నింటినీ కలిపి వచ్చే మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నిర్దేశించుకున్న సమయానికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒడిశా రాష్ట్రంతో చర్చల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. తోటపల్లి బ్యారేజీ కింద వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తిస్థాయిలో నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వెంటనే పనులు పూర్తిచేయాలని సీఎం అన్నారు. మహేంద్ర తనయను పూర్తిచేయడంపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ పనులను ప్రాధాన్యతగా తీసుకున్నారు. గులాబ్‌ తుపాను, అనంతర వర్షాల కారణంగా ఎక్కడైనా ఇరిగేషన్‌ కాల్వలు దెబ్బతింటే వాటిని బాగుచేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొల్లేరు వద్ద గోదావరి, కృష్ణా డెల్టాలలో రెగ్యులేటర్‌ నిర్మాణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సీఎం ఆదేశించారు. నిర్మాణంపైన దృష్టిపెట్టాలన్నారు. 

 Also Read: రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? సీఎం జగన్ కు నిర్మాత అల్లు అరవింద్ రిక్వెస్ట్.. సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలని వినతి

తాండవ ప్రాజెక్టు విస్తరణపై దృష్టిపెట్టండి

తాండవ ప్రాజెక్టు విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాండవ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లను పిలిచామన్న అధికారులు, తొలివిడత టెండర్ల ప్రక్రియలో అధికంగా కోట్‌ చేసిన పనులకు సంబంధించి మరోసారి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్, జలవనరులశాఖ ఈఎన్‌సీసీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Also Read: అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget