Liquor Lottery: లాటరీలో మద్యం షాపు పొందిన వ్యక్తి కిడ్నాప్ అంటూ ప్రచారం - అసలు నిజం ఏంటంటే?
Andhra News: సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో లాటరీలో మద్యం షాపు పొందిన వ్యక్తి కిడ్నాప్ అంటూ సాగిన ప్రచారానికి తెరపడింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ స్వయంగా ఆ వ్యక్తి పోలీసులను కలిశాడు.
Rumour On Man Kidnapped In Satyasai District: సత్యసాయి జిల్లా (Satyasai District) చిలమత్తూరు మండలంలో మద్యం షాపు పొందిన వ్యాపారి కిడ్నాప్ అంటూ సాగిన ప్రచారంపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. యగ్నిశెట్టిపల్లికి చెందిన రంగనాథ్ లాటరీలో మద్యం షాపు దక్కించుకోగా దాని కోసం ఎవరో కిడ్నాప్ చేశారంటూ ప్రచారం సాగింది. అయితే, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. అది అవాస్తవమని రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సీఐను కలిసి పరిస్థితిని వివరించారు. తన ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో బంధువులకు ఎవరో నీ భర్తను కిడ్నాప్ చేశారంటూ.. తన భార్యకు ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. ఈ క్రమంలోనే తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
ఇదీ జరిగింది
కాగా, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు లాటరీ తీయగా చాలామంది దుకాణాలు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే సత్యసాయి జిల్లాలో ఓ వ్యక్తి కిడ్నాప్ అయ్యారంటూ ప్రచారం సాగింది. చిలమత్తూరు మండలానికి చెందిని రంగనాథ్ అనే వ్యక్తి లేపాక్షి మండలం షాపు నెంబర్ 57 లాటరీలో షాపును దక్కించుకున్నాడు. ఇది జీర్ణించుకోలేక అతన్ని కొందరు అపహరించి ఆ షాపును బలవంతంగా లాక్కోవాలని చూశారని వందతులు వ్యాపించాయి. లాటరీ కన్ఫామ్ అయినప్పటి నుంచి రంగనాథ్ ఆచూకీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోవడం లేదని రంగనాథ్ భార్య, కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్వయంగా రంగనాథే సీఐను కలిసి చెప్పారు.
Also Read: YS Jagan: లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు