అన్వేషించండి

YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు

Andhra Pradesh News | ఏపీలో మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులపై లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటిస్తున్నారు. మద్యం షాపులను ఇకనుంచి వారే నిర్వహించుకుంటారు. దీనిపై వైఎస్ జగన్ స్పందించారు.

Andhra Pradesh  liquor mafia and syndicates | అమరావతి: ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ త్వరలో అమలులోకి రానుంది. ఈ మేరకు మద్యం దుకాణాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా తీసి విజేతల్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ బిజినెస్, సిండికేట్లపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో జగన్ పలు అంశాలు పోస్ట్ చేశారు. 

1. లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్‌ కాదా? మీ మనుషులతో సిండికేట్‌ ఏర్పాటుచేసి షాపులను కొట్టేయడం నిజం కాదా? రానున్న ఐదేళ్లలో పెద్ద మొత్తంలో ఎమ్మార్పీ (MRP Price) కంటే అధిక రేట్లతో అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీల ద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా?

కమీషన్ల వాటాలు వేసుకోవడం వాస్తవం కాదా?

2.చంద్రబాబు… మీరు తెచ్చిన లిక్కర్‌ పాలసీ (AP Liquor Policy) గొప్పదే అయితే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించిఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏముంది? “నీకింత… నాకింత’’ అని కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? ఇది ఓ ఫార్స్‌ కాదా? లైసెన్స్‌ ఫీజులతోపాటు కిందనుంచి మీ దాకా కమీషన్లు కోసం, మీవారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించడంకోసం లిక్కర్‌ కొనుక్కున్నవారి జేబులు గుల్లచేయడానికి మీరంతా సిద్ధం అయినట్టేకదా? మీకింత వారికింత చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా? దీనివల్ల తమ కుటుంబాల్లో చదువులకోసం, ఇతర బాగోగులకోసం ఖర్చుకావాల్సిన ప్రజల ఆదాయాలను మీ జేబుల్లోకి వేసుకోవడానికి పన్నిన అవినీతి పథకం కాదంటారా చంద్రబాబు?

ప్రభుత్వానికి ఆదాయం రాకుండా గండి

3. కొత్తపాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రానీయకుండా, మీరు గండికొట్టారు. ప్రజలను మభ్యపెట్టడానికి చీప్‌ లిక్కర్‌ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి, దీనికోసం క్వాలిటీని తగ్గిస్తూ, ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 డిస్టలరీల్లో 14 మీ హయాంలో వచ్చినవే. వైసీపీ హయాంలో ఒక్క డిస్టరీలకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇంకోవైపు ఎమ్మార్పీమీద నియంత్రణ తీసివేసి, మీ వారికి, మీ మాఫియాకు షాపులు అప్పగించి, అక్కడకూడా మీకు ఇంత… నాకు ఇంత అని ఎమ్మార్పీపైన రేట్లు పెంచి వసూలు చేయడం ప్రజల నడ్డి విరగొట్టడం కాదా చంద్రబాబు?

ఫక్తు లిక్కర్‌ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు 
4. ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మితే అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. అమ్మకం వేళలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల మద్య నియంత్రణ అనే ప్రాథమిక బాధ్యత దిశగా ప్రభుత్వాలు కాస్తైనా పనిచేసినట్టు అవుతుంది. చంద్రబాబు… ఇప్పుడు మీ విధానం ద్వారా మీ సొంత ఆదాయంకోసం ఆ లక్ష్యానికి తూట్లుపొడిచినట్టే కదా? ఒక ఫక్తు లిక్కర్‌ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు కాని, రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడంలేదు? కారణం ఈ కొత్త పాలసీలో మీ సొంతలాభం ఉండబట్టే కదా?

5. 2014-19 మధ్య ఇదేమాదిరిగా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. ప్రజల ఆరోగ్యాలను, కుటుంబాల పరిస్థితులను పణంగా పెట్టేలా లిక్కర్‌ పాలసీని తెచ్చి దాని మీద కాసులు ఏరుకున్నారు. అప్పట్లో మీ సిండికేట్లు బడిపక్కన, గుడిపక్కన బెల్టుషాపులు పెట్టిమరీ ప్రతి ఇంటికీ డోర్‌డెలివరీ స్థాయికి పరిస్థితులను తీసుకెళ్లాయి. కాగితాలమీద కనిపించే దుకాణాలే కాకుండా, వాటికి అదనంగా పర్మిట్‌ రూమ్స్‌, దీనికి తోడుగా 43వేల బెల్టుషాపులతో లిక్కర్‌ ఏరులై పారింది.. వైయస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అలాంటి దారుణ పరిస్థితులను కూకటి వేళ్లతో పెకలించింది. మద్యం దళారులకు, అందులోని రాజకీయ వ్యాపారులకు చెక్‌ పెట్టింది. దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించి మద్యం అమ్మకాలను నియంత్రించింది. అమ్మకాలు కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చేసింది. లాభాపేక్షలేనందున పర్మిట్‌రూమ్స్‌, బెల్టుషాపులు.. ఇవన్నీ రద్దు అయ్యాయి. ఈ పద్ధతిని ఇప్పుడు ఎత్తివేసి, దుకాణాల సంఖ్యను మళ్లీ పెంచి మొత్తం అన్నింటినీ మీ మనుషులకు అప్పగించారు. ఇక వీళ్లు ఏర్పాటు చేసే పర్మిట్‌రూమ్స్‌, బెల్టుషాపులకు లెక్కే లేదు. మళ్లీ రాష్ట్రాన్ని పూర్వపు దారుణ పరిస్థితులకు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు?

Also Read: AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?

6. లక్షల సంఖ్యలో ఉద్యోగాలంటూ అబద్ధాలుమీద, అబద్ధాలు చెప్పి రోజూ మీ మీడియాలో ఊదరగొట్టే మీరు, మీ స్వార్థం కారణంగా ప్రభుత్వ లిక్కర్‌ షాపుల్లో పనిచేస్తున్న 15వేలమంది ఒక్కసారిగా నిరుద్యోగులై రోడ్డునపడ్డారు. మరి, వీరి బాగోగుల సంగతేంటి చంద్రబాబుగారూ?

7. చంద్రబాబు… మీ అక్రమార్జన కోసం, మీకు, మీవాళ్లకు అవినీతి డబ్బు సంపాదించడంకోసం మీరు అమలు చేస్తున్న లిక్కర్‌ పాలసీ రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం. అక్కచెల్లెమ్మల ఉసురు, యువత ఉసురు, ఆరోగ్యం రూపేణా ప్రజల ఉసురు మీరు పోసుకున్నట్టే. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఇప్పటికే తిరోగమనం పట్టించారు. అవినీతి ధ్యేయంగా తెచ్చిన లిక్కర్‌ పాలసీతో రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. మీ చర్యలను వెంటనే సరిదిద్దుకోండి. లేకుంటే ప్రజల తరఫున ఉద్యమిస్తాం’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.

Also Read: AP Liquor Shops: '6'వ నెంబర్ కాదు అది '9' - అక్కడే గొడవ మొదలైంది!, ఏపీలో లిక్కర్ లాటరీ 'సిత్రాలు'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Peddi Movie Glimpse: రామ్ చరణ్ 'పెద్ది' నుంచి మరో అప్ డేట్ - గ్లింప్స్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది' నుంచి మరో అప్ డేట్ - గ్లింప్స్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Embed widget