అన్వేషించండి

AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?

Andhra Pradesh : ఉచిత ఇసుక అమలులో ఏపీ ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. పేరుకే ఉచితం కానీ వైసీపీ హయాం కన్నా ఎక్కువగా ధరలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు.

Free Sand Policy : వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అంశంపై చాలా దుమారం రేగింది. రాష్ట్రం మొత్తం ఒకే కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వడం దగ్గర నుంచి చివరికి ఆ కాంట్రాక్ట్ కంపెనీ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోవడం వరకూ చాలా ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఇసుక బంగారం అయిపోయింది. ఒక్కో లారీ ఇసుక యాభై వేలు దాటిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్ని టీడీపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. తాము వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు. అనుకన్నట్లుగానే తెచ్చారు. కానీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. అప్పుడు వైసీపీపై  .. ఇప్పుడు టీడీపీపై వస్తున్నాయి. 

ఇసుక పాలసీపై వైసీపీ నేతల తీవ్ర విమర్శలు

ఏపీలో ఇసుక దొరకడం లేదని ఉచిత ఇసుక పేరుతో ప్రజల్ని  దోపిడీ చేస్తున్నారని తమ హయాంలోనే చాలా తక్కువకు ఇసుక వస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.మాజీ సీఎం జగన్ కూడా ఈ అంశంపై ఆరోపణలు చేస్తూ సుదీర్గమైన ట్వీట్ పెట్టారు. ప్రతి రోజూ ఇసుక అంశంపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. 

ఇసుక ఉచితమే కానీ రవాణా చార్జీలు, సీవరేజీ కట్టాల్సిందే !

ఉచిత ఇసుక అంటే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారన్నట్లుగా వైసీపీ  నేతలు ప్రచారం చేస్తున్నారని .. లోడింగ్, అన్ లోడింగ్ , రవాణా ఖర్చులు ఎవరికి ఇసుక కావాలో వారే భరించాలని ప్రభుత్వం ఓంటింది.  ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తోంది. కానీ దాన్ని లారీలోకి లోడ్ , అన్ లైడ్ చేయడానికి, ఆ లారీని తమ ఇంటి వరకూ తీసుకెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చు మాత్రం వినియోగదారుడే భరించాలి. ఇసుక రవాణా దూరాన్ని బట్టి ఖర్చు పెరుగుతుంది. తమకు ఎంత దగ్గరగా ఉన్న స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి  ఇసుక తీసుకుంటే వినియోగదారులకు అంత తక్కువ అవుతుంది. ప్రభుత్వ వెబ్ సైట్‌లో ఉన్న దానిప్రకారం  టన్నుకు కూలీ, రవాణా ఖర్చులు టన్నుకు  ఇం ధర అని ఖరారు చేశారు.   ప్రభుత్వం పూర్తిగా ఈ మొత్తాన్ని పక్కా బిల్లు ఇచ్చి ఆన్ లైన్‌లోనే తీసుకుంటోంది.  అదనంగా ఎక్కడా ఒక్కరూపాయి వసూలు చేసే ప్రైవేటు వ్యక్తులు ఉండరని చెబుతున్నారు. 

వైసీపీ హయాంలో ఇసుక దందాను ప్రజలు మర్చిపోరంటున్న టీడీపీ నేతలు

వైసీపీ హయాంలో  స్టాక్ పాయింట్లు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని . అనధికారికంగా బిల్లుల ద్వారా   ట్రాక్టర్ ఇసుకకు ఇరవై వేల వరకూ వసూలు చేసేవారని  అంటున్నారు. ఇప్పుడు అది వెయ్యి రూపాయలకే వస్తోందని చెబుతున్నారు. పైగా కూటమి ప్రభుత్వం అన్నీ చట్టబద్దంగా చేస్తోందని ఇష్టం వచ్చినట్లుగా తవ్వకాలకు అవకాశం కల్పించడం లేదని చెబుతోంది. గతంలో జరిగినట్లుగా పర్యావరణ విధ్వంసం జరగకుండాచ చూసుకుంటున్నారు.  సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయవచ్చు కానీ.. ఇసుక విషయంలో  ప్రజల ఇబ్బందులు తీరిపోయాయని  నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుని కూలీలకు  ఉపాధి పెరగడమే సంకేతమనిటీడీపీ నేతలు చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget