అన్వేషించండి

AP Liquor Shops: '6'వ నెంబర్ కాదు అది '9' - అక్కడే గొడవ మొదలైంది!, ఏపీలో లిక్కర్ లాటరీ 'సిత్రాలు'

Andhra News: ఏపీలో లిక్కర్ షాపులకు లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అయితే, శ్రీకాకుళం జిల్లాలో 6, 9 నెంబర్ల మధ్య గందరగోళంతో స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

Liquor Shops Lottery In Andhrapradesh: ఏపీలో లాటరీ ప్రక్రియ ద్వారా మద్యం షాపులను అధికారులు సోమవారం కేటాయించారు. మొత్తం 3,396 షాపులకు 89,882 దరఖాస్తులు రాగా.. జిల్లా కలెక్టర్ల ఆధర్యంలో డ్రా తీశారు. విజేతలకు అనంతరం లైసెన్స్ ఇవ్వనున్నారు. అయితే, శ్రీకాకుళం జిల్లాలో లాటరీ సందర్భంగా గందరగోళం చోటు చేసుకుంది. అంబేడ్కర్ ఆడిటోరియంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యవేక్షణలో లక్కీ డ్రా జరుగుతుండగా.. ఆమదాలవలస సర్కిల్ పరిధిలోని 42వ మద్యం షాపు విషయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ దుకాణానికి సంబంధించిన డ్రాలో 9వ నెంబర్ వస్తే దాన్ని అధికారులు పొరపాటున 6వ నెంబర్ అని మైక్‌లో బహిరంగంగా అనౌన్స్ చేశారు. దీంతో 6వ నెంబర్ దరఖాస్తుదారుడు సంబరపడ్డాడు. అయితే, అది 6ను తిప్పితే 9 అవుతుందని.. దాన్ని క్రాస్ చెక్ చేయాలని అధికారులను కోరగా.. అది 9 అని తేలింది. దీంతో మళ్లీ అధికారులు వెంటనే 9వ నెంబర్ అని ప్రకటించారు. దీంతో 6వ నెంబర్ వ్యక్తి తీవ్ర నిరాశకు గురయ్యాడు.

అధికారులతో వాగ్వాదం

ఇదే క్రమంలో అధికారులు కావాలనే నెంబర్ మార్చేశారంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. తోటి దరఖాస్తుదారులు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాపుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని.. ఇలాంటి సమయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ మండిపడ్డారు. అనంతరం అధికారులు ఆందోళనకారులకు జరిగింది వివరించి సద్దిచెప్పారు. దీంతో వారు శాంతించగా లాటరీ ప్రక్రియ యథావిధిగా సాగింది.

లక్కంటే ఆయనిదే..

అటు, రాష్ట్రవ్యాప్తంగా లక్కీడ్రా ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. లాటరీల్లో దుకాణాలు దక్కించుకున్న వారు నగదు సమీకరించుకునే పనిలో పడ్డారు. ఈ లాటరీలో కొందరి పంట పండింది. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి ఏకంగా 5 దుకాణాలను దక్కించుకున్నారు. పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ తీయగా.. ధర్మవరం మున్సిపాలిటీ దుకాణం 1, 4.. ధర్మవరం రూరల్‌లో 12, ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నెంబర్ దుకాణాలు ఆయనకు వచ్చాయి. ఒకే వ్యక్తికి ఐదు దుకాణాలు రావడం నిజంగా అదృష్టమేనని అంతా చర్చించుకుంటున్నారు.

అటు, రాష్ట్రంలో బుధవారం నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. లాటరీ కేంద్రాలు జన జాతరను తలపించాయి. దరఖాస్తు ఫీజు ద్వారా రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్కువ దుకాణాలు తిరుపతి జిల్లాలో ఉంటే అతి తక్కువ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. తిరుపతి 227 దుకాణాలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అల్లూరి సీతారామారాజు జిల్లాలో 40 మాత్రమే దుకాణాలు ఉన్నాయి. పోటీ ఎక్కువ ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే తక్కువ అనంతపురం జిల్లాలో ఉంది. 

Also Read: AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
Nagavamsi: సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
Nobel Prize  2024 : దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహంవీడియో: నా శవం మీద సెటిల్ చేసుకోండి, సికింద్రాబాద్‌లో మాధవీలత అరెస్ట్Vivek Venkata Swamy: వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమా? చెన్నూర్ ఎమ్మెల్యేతో ఫేస్ 2 ఫేస్సల్మాన్‌ను చంపితే లారెన్స్ బిష్ణోయ్‌కు వచ్చే ప్రయోజనం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
Nagavamsi: సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
Nobel Prize  2024 : దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
YCP Leader Attack On Anchor : మార్గాని భరత్ అనుచరుడు మామూలోడు కాదు - అప్పు తిరిగివాలన్నందుకు మహిళా యాంకర్‌పై దాడి !
మార్గాని భరత్ అనుచరుడు మామూలోడు కాదు - అప్పు తిరిగివాలన్నందుకు మహిళా యాంకర్‌పై దాడి !
TDP Office: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు
Telangana News: దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
Pawan Kalyan Comments : అల్లు అర్జున్ బాగుండాలని కోరుకునే వాడిని- పవన్ ఆసక్తికరమైన కామెంట్స్
అల్లు అర్జున్ బాగుండాలని కోరుకునే వాడిని- పవన్ ఆసక్తికరమైన కామెంట్స్
Embed widget