అన్వేషించండి

Chiranjeevi Reaction: గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా మాట్లాడతా - బాలకృష్ణకు చిరంజీవి కౌంటర్ - పూర్తి లేఖ ఇదిగో

Chiranjeevi: ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. సినీ పరిశ్రమ కోరిక మేరకు తాను జగన్ తో చర్చలకు వెళ్లానన్నారు. గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా మాట్లాడతానన్నారు.

Chiranjeevi on Balakrishna comments:  అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే  తాను వెళ్ళాను.. జగన్ సాదరంగా నన్ను ఆహ్వానించారు.. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించా.. సమయం ఇస్తే అందరం వస్తామని చెప్పానన్నారు.కోవిడ్ వల్ల అయిదుగురే రావాలని చెబితే పదిమందిమి వస్తామన్నా  సరేనన్నారు.. బాలకృష్ణకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదదని చిరంజీవి తెలిపారు. చిరంజీవి ప్రకటనపూర్తి పాఠం 
 

తేది: 25.09.2025

పత్రికా ప్రకటన

సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా  గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ “కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ” అంటూ ” ఆయనంత  పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినీమాటోగ్రఫీ మినిస్టరును కలవడన్నాడట”, అంటూ ఒకింత వ్యంగ్యంగా  చెప్పడాన్ని నేను టీవీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను.
 ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక  నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు - తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని  కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు ఉన్నారు.  వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్ లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రిగారు నాకు ఫోన్ చేసి “ ముఖ్యమంత్రి గారు ముందు మీతో ఒన్ టు ఒన్ కలుస్తానని చెప్పారు. లంచ్ కి రావాలని చెప్పారంటూ” డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్నినాని గారు నాకు ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున, ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనప్పుడు ఓ పదిమందిమి వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను.  ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తి గారితో సహా మరి కొంతమందిని వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిసాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు  ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహా రెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని  అందరికీ తెలియచేస్తున్నాను. 

ఇట్లు,
కె. చిరంజీవి.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Advertisement

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Embed widget