chandrababu On Jagan: ఇప్పటి వరకూ నా మంచితనమే చూశారు - ఇక కాస్కోండి - రౌడీయిజానికి చంద్రబాబు హెచ్చరిక
Andhra Pradesh: రౌడీయిజంపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ తన మంచితనాన్నే చూశారని అన్నారు.

Chandrababu Naidu strict action against rowdyism: ప్రజా భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశం చేసింది చాలక కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక రాక్షసుల మాదిరి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవతల రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అన్నారని మండిపడ్డారు. తెనాలిలో గంజాయి బ్యాచ్‌ను పరామర్శిస్తారా.? పొదిలికి గూండాలను తీసుకెళ్లి మహిళలపై దాడి చేసి రౌడీయజం చేస్తారా.? అని ప్రశ్నించారు. పాలన పూర్తయి ఏడాది అయిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదన్నారు. సమస్యలను అధిగమనించేందుకు మేము ప్రయత్నిస్తుంటే రాక్షసుల మాదిరి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, శాంతిభద్రతల సమస్య సృష్టించి ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. నేరాలు, ఘోరాలు చేసే వారికి అండగా ఉంటున్నారు. ఇలాంటి వారికి మద్దతిస్తున్న నీకు ప్రజలెందుకు నీకు మద్ధతివ్వాలని ప్రశ్నించారు. పొగాకు క్వింటాలు రూ.12 వేలు ధర ఇస్తున్నాం. బాధ్యత లేకుండా వేల మందిని వెంటేసుకుని పొదిలి వెళ్లి హంగామా చేశారని మండిపడ్డారు.
దేవతల రాజధాని అమరావతి వేశ్యల నగరమా? ఎంత కొవ్వెక్కితే ఇలాంటి మాటలు వస్తాయి.? అమరావతిపై చేసిన మురికి వ్యాఖ్యలను పక్కదారి పట్టించేందుకే పొదిలి వెళ్లి గొడవలు చేశారు. అక్కడ మహిళలపై రాళ్లదాడి చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోను. ప్రజల భద్రత విషమయంలో రాజీపడను. రౌడీయిజం చేసి పెత్తనం చేయాలంటే ఆటలు సాగనివ్వను. ఇప్పటివరకూ నా మంచితనం చూశారు. ఇకపై ఉపేక్షించను’ అని సీఎం చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.
రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా పర్యటనల సమయంలో రౌడీ మూకలతో వెళ్లి చిచ్చు పెట్టేందుకు, శాంతిభద్రతల సమస్యలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై పోైలీసులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి ఈ అరాచకాలు ఏంటి? మహిళలపై, పోలీసులపై రాళ్లు వేస్తారా? (1/2) pic.twitter.com/NO0bEZmH6v
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 11, 2025
ఇటీవల జగన్ వివిధ చోట్ల పర్యటనకు వెళ్తున్నారు. వెళ్లిన ప్రతీ చోటా వివాదాస్పద అంశాలు జరుగుతున్నాయి. రాప్తాడులో హెలిప్యాడ్ ను.. వైసీపీ నేతలు సమీకరించన జనం చుట్టు ముట్టడంతో సమస్యలు వచ్చాయి. అక్కడ పెద్ద ఎత్తునకేసులు నమోయ్యాయి. తెనాలిలోనూ పోలీసులపై దాడి చేసిన రౌడీషీట్రలను పరామర్శించాడనికి వెళ్లారు. పొదిలిలో నిరసన చేస్తున్న మహిళలపై దాడులు చేశారు. పొగాకు బ్యారన్లను తొక్కేశారు. ఇక వీటిని ఉపేక్షించరాదని చంద్రబాబు పోలీసులుకు స్పష్టంచేశారు.





















