Chandra Babu : ప్రతి ఒక్క వినతికి పరిష్కారం - టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు భరోసా
TDP : టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు ఇస్తున్న ప్రతి వినతి పత్రానికి పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. జిల్లాల్లోనూ కార్యకర్తల వినతులు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు.
Andhra Pradesh TDP : తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఎన్ని వినతులు వచ్చినా.. వాటన్నింటినీ పరిష్కారమే లక్ష్యం గా పెట్టుకున్నానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. పార్టీ కార్యాయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత 5ఏళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని.. రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులు పై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని.. రికార్డులు కూడా తారుమారు చేశారన్నారు.
భూ సంబంధింత సమస్యలే ఎక్కువ
భూముల రీ సర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. ప్రతీ జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. రెవెన్యూశాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ అని స్పష్టం చేశారు. 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామని.. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖ ను ప్రక్షాళన చేస్తామన్నరాు. వినతులు ఎక్కువ తీసుకోవటంతో పాటు ఎక్కువ సమస్యల పరీష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నానని.. ప్రతీ ఒక్కరి సమస్యా సాధ్యమైనంత త్వరగా పరీష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
టైమ్ ఫ్రేమ్ పెట్టి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం
వచ్చిన వినతులన్నీ శాఖల వారీగా విభజించి నిర్థిష్ట కాలపరిమితి లోపు వాటి పరిష్కారమయ్యేలా కార్యాచరణ రూపొందించుకున్నామని.. ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున సమస్యలతో వస్తున్నారన్నారు. కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా వేటికవి విభజించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకూ రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా యంత్రాంగం రూపొందిస్తున్నామని ప్రకటించారు.
మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి అవసరమైన చోట్ల వసతి గృహాలు, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
జిల్లాల్లో తన పర్యటనల సందర్భంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. పోలీసు వ్యవస్థ సంయమనం పాటిస్తూ ప్రజా పోలీసింగ్ చేసే వ్యవస్థ గా మారుస్తామని స్పష్టం చేశారు. వర్షాలు పడి ప్రాజెక్టులు కూడా నిండటంతో రైతులు సంతోషం గా ఉన్నారు. శాఖల వారీ సమీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు.