అన్వేషించండి

Srikakulam News: సెంటు స్థలం ఇళ్లు నరకానికి మరో రూపం - శ్రీకాకుళం జిల్లాలో ఇదీ పరిస్థితి

Andhra : వైసీపీ ప్రభుత్వంలో పేదలకు సెంటు స్థలాలు పంపిణీ చేశారు. కానీ అనేక కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో జీవించలేకపోతున్నారు.

Srikakulam Houses :  ప్రభుత్వం కట్టించేవి ఇళ్లు కాదు ఊళ్లు అని గత సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు. అయితే ఆ ఊళ్లల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. సెంటు స్థలాలుగా మార్చి కాలనీలుగా నిర్మాణఆలు చేసిన వాటిలో చాలా కాలనీలు లబ్ధిదారులకు అందుబాటులోకి రాలేదు. తాగునీరు, కరెంటు, రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస వసతులు కల్పించకపోవడం వల్ల వీటిలో చేరేందుకు లబ్ధిదారులు ముందుకు రావడంలేదు.

నివాసం ఉండేందుకు ముందుకు రాని లబ్దిదారులు     

శ్రీకాకుళం జిల్లాలో  సగానికిపైగా కాలనీలు నివాసయోగ్యంగా లేక ఖాళీగా ఉండిపోయాయి. ఊరికి దూరంగా కట్టిన ఈ ఇళ్లలో చేరేందుకు లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు.   'నవ రత్నాలు-అందరికీ ఇళ్లు' పేరుతో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పథకానికి 2021లో శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టింది. రెండు దశల్లో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లులేని పేదల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైనవారిని గుర్తించి జాబితాలు రూపొందించారు. ఆ మేరకు ఎక్కడ ఎంత మందికి ఇళ్లు ఇవ్వాలో గుర్తించి ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి లే అవుట్లు అభివృద్ధి చేశారు. పట్టణ, నగర ప్రాంతాల లబ్ధిదారు లకు ఒకటింపావు సెంటు, గ్రామీణ లబ్ధిదారులకు సెంటు చొప్పున స్థలాలు కేటాయించి లే అవుట్లు వేశారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వ సబ్సిడీ రూ.1.80 లక్షలు ఇవ్వగా, నిర్మాణానికి అయ్యే మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు ఇప్పించే ఏర్పాటు చేసింది. ఆ మేరకు కేటాయించిన ప్లాట్లలో లబ్దిదారులను పెట్టి జియోట్యాగ్ కూడా చేయించి, దస్తావేజులు కూడా ఇచ్చారు. లబ్ధిదారుడి వెసులుబాటును బట్టి ప్రభుత్వమే నిర్మించిఇవ్వడం లేదా లబ్ధి దారులే సొంతంగా నిర్మించుకునే అవకాశంఇచ్చింది. ఆ మేరకు శ్రీకాకుళం జిల్లాలో 790 లే అవుట్లలో 33,285 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 708 లే అవుట్లలోనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే వీటిలోనూ చాలావరకు అసంపూర్తిగానే ఉన్నాయి. 8846 ఇళ్లు మాత్రమే ఇప్పటివరకు పూర్తి అయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

పార్టీని వదిలే ప్రసక్తే లేదు - వైసీపీ హైకమాండ్‌కు చల్లని కబురు చెప్పిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు

కనీస సౌకర్యాలు మృగ్యం

జగనన్న కాలనీల్లో చాలా వాటిలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనా పూర్తి అయిన వాటి సంఖ్య చాలా తక్కువ.  ఇప్పటికీ కనీస సౌకర్యాలు కల్పిం చకపోవడం వల్ల లబ్ధిదారులుఆసక్తి చూపడంలేదు. జనావాసాలకు దూరంగా కొండలు, గుట్టల సమీపంలో లే అవుట్లు వేయడం వల్ల తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలన్నింటినీ కొత్తగా కల్పించాల్సిన పరిస్థితి. కానీ అధికారులు ఆ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా కాలనీల్లో చిన్నపాటి వర్షా లకే నీటితో నిండిపోయి, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఎక్కడో దూరప్రాంతాల నుంచి విద్యుత్ లైన్లు పొడిగించి కాలనీలకు కరెంటు ఇవ్వడం అనేక సమస్యలతో కూడుకున్నది కావడంతో చాలా కాలనీల్లో మెయిన్ లైన్లు వేయడంలోనే జాప్యం జరుగుతోంది. అవి పూర్తి అయితే తప్ప ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చే అవ కాశం ఉండదు. అలాగే రోడ్లు, కాలువల నిర్మా ణాలు నత్తనడకన సాగుతున్నాయి.

నివాసయోగ్యం కాని  చోట్ల ఇళ్ల స్థలాలు

లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో 114 ఇళ్లతో కాలనీ ఏర్పాటు చేయగా ఇప్పటికీ అక్కడ 40 ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. వర్షం పడితే కాలనీ చెరువులా మారిపోతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. నరసన్నపేట మండలం ఉర్లాంలో పంట పొలాలకు వెళ్లే గోర్జి మార్గంలో ఆక్రమణలు తొలగించి లే అవుట్ వేశారు. అక్కడ 55 మందికి ఇళ్లు మంజూరు కాగా 45 మంది నిర్మాణాలు పూర్తి చేసి నివాసం ఉంటున్నారు. అయితే రహదారిని అభివృద్ధి చేయకపోవడం, మురుగు కాలువలు నిర్మించకపోవడంతో వర్షాలు పడినప్పుడు నానా అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలసలో 200 ఇళ్లతో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో 15 కుటుంబాలే నివాసం ఉంటున్నాయి. ఈ కాలనీకి కూడా కాలువలు, రోడ్లు లేవు. శ్రీకాకుళం రూరల్ మండలం వాకలవలస జగనన్న కాలనీలో 1780 మందికి ఇళ్లు కేటాయించగా కేవలం వంద కుటుంబాలే నివాసం ఉంటున్నాయి. మరో వంద కుటుంబాలు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశా లకు సిద్ధమైనా వర్షాలకు కాలనీ అంతా జలమయం కావడంతో వెనుకంజ వేశారు.దూరాభారంతో అమ్మకాలులబ్ధిదారులను మరో కీలక సమస్య ఇబ్బందిపెడుతోంది. జిల్లాలోని మెజారిటీ కాలనీలను కొండలు, గుట్టలు, లోతట్టు ప్రాంతాల్లో కాలనీ లేఅవుట్లు వేశారు. దాదాపు అవన్నీ జనావాసాలకు,ఊళ్లకు దూరంగా ఉన్నాయి. అదే సమయంలోఇళ్లు మంజూరైన వారిలో అధికశాతం పేదవర్గాలకు చెందినవారే. ఊళ్లలో చిన్నాచితకాపనులు చేసుకుని పొట్టపోసుకునేవారే. ఇప్పుడువారందరూ ఊరికి దూరంగా ప్రభుత్వం ఇచ్చినఇళ్లలోకి వెళితే ఉపాధి కోల్పోయే ప్రమాదముంది.ఉపాధి కోసం రోజూ ఆ కాలనీల నుంచి ఊళ్ల లోకి రావాలంటే దూరాభారం, ఖర్చులతోకూడుకున్నది కావడంతో ఉపాధి వదులుకుని ఆఇళ్లలో చేరేందుకు చాలామంది లబ్ధిదారులు ఇష్టపడటం లేదు. అదే సమయంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిర్దేశించి యూనిట్ కాస్ట్ ఏమాత్రం సరిపోవడంలేదు. అలాగే సబ్సిడీ పోనుమిగతా మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించడం కూడా భారమేనని లబ్ధిదారులు భావిస్తున్నారు.  

'ఆ మొక్కలు పెంచొద్దు' - వన మహోత్సవంలో పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు

ఎంతో కొంతకు అమ్మేసుకుంటున్న లబ్దిదారులు

చాలామంది జగనన్న ఇళ్లను అమ్మేసుకుంటున్నారు. సగం నిర్మించి వదిలేసినఇళ్లను, తమకు కేటాయించిన స్థలాలను  బేరం పెట్టి అమ్మేస్తున్నారు. శ్రీకాకుళం నగరానికి సమీపంలోఉన్న ఎచ్ఛర్ల మండలం కుశాలపురం పారిశ్రామికవాడ వెనుక 80 మంది లబ్ధిదారులకు ఇళ్లుమంజూరు చేయగా అక్కడ చాలామంది మధ్యవర్తుల ద్వారా వాటిని విక్రయించేస్తున్నారు. కాగాఅర్హతలు లేకపోయినా పరపతితో, బోగస్ పత్రాలతో ఇళ్లు పొందినవారిలో ఎక్కువమంది వాటిని అమ్మేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది .కుశాలపురంలోనే కాకుండా జిల్లాలోని దాదాపుఅన్ని కాలనీల్లోనూ విక్రయాలు కొనసాగుతున్నాయి. దళారులు ఇదే పనిలో నిమగ్నమైకమీషన్ల రూపంలో పెద్ద ఎత్తున సంపాదించుకుంటున్నారు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోయి ఎన్డీయేకూటమి ప్రభుత్వంలోకి రావడంతో అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీల పరిస్థితి డోలాయమానంలో పడింది. లబ్ధిదారులు ఇళ్లు అమ్మేసుకుంటున్నారన్న ఫిర్యాదులు సైతం ప్రభుత్వానికిఅందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంజగనన్న కాలనీల విషయంలో ఎలాంటి నిర్ణయంతీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget