అన్వేషించండి

YSRCP : పార్టీని వదిలే ప్రసక్తే లేదు - వైసీపీ హైకమాండ్‌కు చల్లని కబురు చెప్పిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు

Andhra Pradesh : వైసీపీకి రాజీనామా చేయడం లేదని ముగ్గురు ఎంపీలు క్లారిటీ ఇచ్చారు. రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరగడంతో ఈ ప్రకటనలు చేశారు.

Three MPs have clarified that they are not resigning from YCP :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి నడుస్తోంది. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో వారి బలం 9కి పడిపోయిదంది.  ఈ తొమ్మిది మందిలోనూ ఆరేడుగురు పార్టీ మారిపోతారని విస్తృత ప్రచారం జుగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ముగ్గురు ఎంపీలు ప్రకటనలు విడుదల చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోమని ప్రకటించారు. వారు ముగ్గురు ఎవరంటే విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ . కృష్ణయ్య. 

వైసీపీని వీడేది లేదన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ 

వైసీపీకి రాజీనామా చేయబోయే ఎంపీల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు కూడా జోరుగా వినిపించింది. ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తామెవరం వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తమకు జగన్ ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు. తాను రాజీనామా చేసినా సీటు మళ్లీ వైసీపీకి రాదని అలాంటప్పుడు రాజీనామా చేయడం కూడా ద్రోహమేనన్నారు. వైసీపీకి తాము ద్రోహం చేయబోవడం లేదన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పిల్లి సుభాష్ తో పాటు మోపిదేవి వెంకటరమమలు వారి వారి నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పుడు జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. అయితే కొద్ది రోజులకే శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పి వారితో రాజీనామాలు చేయించి రాజ్యసభ పదవులు ఇచ్చారు. అటు మండలిని రద్దు చేయలేదు.. వీరు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ సీట్లు వేరే వారికి ఇచ్చారు. ఇటీవల రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తన కుమారుడికి టిక్కెట్ కోసం పిల్లి సుభాష్ పట్టు బట్టి సాధించుకున్నారు. అయితే ఆయన విజయ సాధించలేదు. 

పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఆర్. కృష్ణయ్య

తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీని వీడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఆయనకు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చింది. ఏపీకి ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేశారు. అయితే వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనరు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారన్న ప్రచారం ఉంది. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీ లేదా బీజేపీలో  చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. గతంలో ఆర్.కృష్ణయ్య టీడీపీలోనే ఉండేవారు. ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. అయితే తన గురించి తెలిసిన వారెవరూ పార్ట మారుతారని చెప్పరని ఆయన అంటున్నారు. 

విచారణాధికారి ఎదుట కాదంబరి జత్వానీ హాజరు - తనకు ఎదురైన ఇబ్బందులు వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న నటి

విజయసాయిరెడ్డి కూడా సేమ్ స్టేట్‌మెంట్

విజయసాయిరెడ్డి కూడా తాను పార్టీ మారడం లేదని సోషల్ మీడియాలో ప్రకటించారు. నిజానికి విజయసాయిరెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరగలేదు. కానీ ఆయన వివరణ ఇచ్చారు. 

మరో వైపు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు మరికొంత మంది  పార్టీ మారుతారన్న  ప్రచారం ఊపందుకుంది. వారితో కూడా వివరణ ప్రకటనలు ఇప్పించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. 

న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం - సుప్రీంకోర్టు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి వివరణ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
New Telugu Movies: టాలీవుడ్ లో మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - తమిళ దర్శకులతో తెలుగు హీరోల జోడీ
టాలీవుడ్ లో మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - తమిళ దర్శకులతో తెలుగు హీరోల జోడీ
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
New Telugu Movies: టాలీవుడ్ లో మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - తమిళ దర్శకులతో తెలుగు హీరోల జోడీ
టాలీవుడ్ లో మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - తమిళ దర్శకులతో తెలుగు హీరోల జోడీ
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
Viral News: సరదాగా మొదలుపెట్టి 2,500 కోర్సులు పూర్తి చేసిన శ్రీకాకుళం వాసి, త్వరలో గిన్నిస్ రికార్డ్స్‌లోకి
సరదాగా మొదలుపెట్టి 2,500 కోర్సులు పూర్తి చేసిన శ్రీకాకుళం వాసి, త్వరలో గిన్నిస్ రికార్డ్స్‌లోకి
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Embed widget