అన్వేషించండి

Bail Granted To Chevireddy : అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ మంజూరు, 226 రోజుల తర్వాత బెయిల్‌ ద్వారా ఊరట!

Chevireddy Bhaskar Reddy: అక్రమ మద్యం కేసులో YCP నేత, చంద్రగిరి మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. ఫిజియోథెరపి చేయించుకునేందుకు ACB కోర్టు అనుమతినివ్వడంతో ఈ ఊరట దక్కింది

Bail Granted To Chevireddy: అక్రమ మద్యం కేసులో YCP నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి ఊరట లభించింది. AP ఏపీ హైకోర్టు జనవరి 29 గురువారం  చెవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది. భాస్కర్‌రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్‌ నాయుడులకు కూడా బెయిల్‌ ఇచ్చింది. APలో వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, అందులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాత్ర కూడా ఉందంటూ 2025 జూన్‌17న  సిట్‌ అధికారులు బెంగుళూరులో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఫిజియోథెరపి చేయించుకునేందుకు  ACB కోర్టు అనుమతినిచ్చింది. తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నానని.. ఉండవల్లిలో ఉన్న మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి చికిత్సాలయంలో వైద్యం చేయించుకునేందుకు అనుమతి మంజూరు చేయాలని చెవిరెడ్డి పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు..15 రోజుల పాటూ వైద్యం చేయించుకునేందుకు  అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.  226 రోజుల తర్వాత బెయిల్ ద్వారా చెవిరెడ్డికి ఊరట లభించింది

YCP ప్రభుత్వం మద్యం పాలసీలను మార్చి , నిర్దిష్ట బ్రాండ్ లకు అనుకూలంగా చర్యలు తీసుకున్నారని, దీని ద్వారా కిక్ బ్యాక్ లు సేకరించారనే ఆరోపణలొచ్చాయి.  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు 2024 ఎన్నికల సమయంలో 250 కోట్ల రూపాయల అక్రమ నగదును రవాణా చేశారని, 
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు ఆయన అనుచరులు 2024 ఎన్నికల సమయంలో రూ. 250 కోట్ల అక్రమ నగదును రవాణా చేశారని, దీనికి ప్రధాన ఆరోపితుడు  రాజ్ కాసిరెడ్డి నుంచి నిధులు వచ్చాయని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తెలిపింది
 
2024 మే 09న జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ట్రక్ లో 8 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం అక్రమ నిధులతో రూ.54.87 కోట్లకు పైగా నగదుతో భూములు, ఆస్తులు కొనుగోలు చేశారని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో కేవలం రూ.8.85 కోట్లు మాత్రమే చూపించారని CID తెలిపింది.
 
2025 జూన్ 18న బెంగళూరు ఎయిర్ పోర్ట్ వద్ద భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడు చెరుకూరి వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేశారు. వారు కొలంబోకు విమానం ఎక్కబోతున్న సమయంలో అరెస్ట్ చేశారు. విజయవాడ ACB కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. వెంకటేష్ నాయుడు ఫోన్లో రూ.35 కోట్ల నగదు బండిల్స్ వీడియో దొరకడంతో..ఇది స్కామ్ నిధులకు సంబంధించినదిగా భావిస్తున్నారు

2025 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం చెవిరెడ్డి కుటుంబం, వారి కంపెనీలకు సంబంధించిన రూ. 63.72 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడానికి చర్యలు తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 2025 విజయవాడ ACB కోర్టు భాస్కర్ రెడ్డి సహా పలువురు ఆరోపితుల బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది. మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు అంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది
 
2026 జనవరి 29న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అక్రమ మద్యం కేసులో బెయిల్ మంజూరైంది
 
కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది.. ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget