![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ayyanna : లేటరైట్ పేరుతో బాక్సైట్ మైనింగ్.. సీఎ జగన్ కంపెనీకే తరలిస్తున్నారన్న అయ్యన్న పాత్రుడు !
విశాఖ- తూర్పుగోదావరి సరిహద్దుల్లో బాక్సైట్‌ను తవ్వి భారతి సిమెంట్స్‌కు తరలిస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. అధికారులు ఎవరూ పట్టించుకోకుండా అక్రమాలకు సహకరిస్తున్నారని మండిపడ్డారు.
![Ayyanna : లేటరైట్ పేరుతో బాక్సైట్ మైనింగ్.. సీఎ జగన్ కంపెనీకే తరలిస్తున్నారన్న అయ్యన్న పాత్రుడు ! Ayyanna patrudu alleged that bauxite was being mined on the Visakhapatnam-East Godavari border and being shifted to Bharti Cements. Ayyanna : లేటరైట్ పేరుతో బాక్సైట్ మైనింగ్.. సీఎ జగన్ కంపెనీకే తరలిస్తున్నారన్న అయ్యన్న పాత్రుడు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/cb50bcc9875080daa5eaf9a7057fcc08_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు జరిపి భారతి సిమెంట్స్ కు తరలిస్తున్నారన ిటీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ప్రమేయంతోనే సరుగుడులో లేటరైట్ పేరుతో బాక్సైట్ ను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన లేటరైట్ పేరుతో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన ఆధారాలను బయట పెట్టారు. సరుగుడు అటవీ ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రిజర్వ్ ఫారెస్టులో 10 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారని ఫోటోలు చూపించారు. ఈ రోడ్డుకు అటవీ శాఖ ఎలా పర్మిషన్ ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ప్రజల సౌకర్యార్ధం రోడ్డు వేశానని అటవీ అధికారులు చెబుతున్నా, వాటిపై ఎటువంటి రుసుం చెల్లించకుండా భారీ వాహనాలకు ఎలా అనుమతి ఇస్తున్నారని అయ్యన్న ప్రశ్నించారు. సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని.. రోజూ వందలాది లారీల్లో భారతి సిమెంటు ఫ్యాక్టరీకి తరలిస్తుంటే పోలీస్, అటవీ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ అండతో విచ్ఛలవిడిగా రావికంపాడు స్టేషన్ నుంచి రైల్వే వేగన్ ద్వారా వేల టన్నులు ఎగుమతి చేస్తున్నా, రెండు జిల్లాల అధికారులు పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు.
Also Read; సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !
విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఇంత దోపిడీ జరుగుతుంటే నర్సీపట్నం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ఖండించడం లేదు... దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో బాక్సైట్ మైనింగ్ వ్యవహారం కొంత కాలంగా ఏపీలో రాజకీయ అంశంగా మారింది. అక్కడ జరుగుతోందని బాక్సైట్ మైనింగ్ కాదని, లైటరైట్ మాత్రమేనని ప్రభుత్వం చెప్తుండగా.. విపక్షాలు మాత్రం రూ.15 వేల కోట్ల బాక్సైట్ మైనింగే జరుగుతుందని ఆరోపిస్తున్నాయి.
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు
ఈ ప్రాంతంలో మైనింగ్‌పై ఎన్టీటీలోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. మరీదయ్య అనే వ్యక్తి ఎన్జీటీ ఆధారాలూ సమర్పించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ మైనింగ్ తవ్వకాలను తక్షణం ఆపాలంటూ, దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అక్రమాలకు సహకరించిన అధికారులపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ యథాతథంగా లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తరలిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)