News
News
X

New PRC : ఉద్యోగుల ఉద్యమం లైట్.. ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు.. బిల్లులు రెడీ చేయాలని ట్రెజరీలకు ప్రభుత్వం ఆదేశాలు !

కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల బిల్లులు సిద్ధం చేయాలని ట్రెజరీలకు ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల ఆందోళలను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదని తేల్చేసినట్లయింది.

FOLLOW US: 

ఉద్యోగులు ఉద్యమ బాట పట్టినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం తాము చేయాలనుకుంటోంది చేస్తోంది. కొత్తగా ప్రకటించిన పీఆర్సీని తక్షణం అమల్లోకి తేవాలని డిసైడయింది. ఈ మేరకు ఈ నెల నుంచి పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. సవరించిన పే స్కేల్స్‌ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.  కొత్త పీఆర్సీ, తగ్గించిన హెచ్ఆర్ఏ ప్రకారమే వేతన బిల్లులు తయారు చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !

ఇప్పటికే దీనికి సంబంధించి కొత్త సాఫ్ట్‌వేర్ తయారు చేసి జిల్లాలకు పంపారు. ఈ నెల 25వ తేదీలోపు బిల్లులు పంపాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 23 శాతం ఫిట్‌మెంట్‌తో కోతపెట్టిన హెచ్ఆర్ఏ, కొత్త డీఏలను కలుపుకుని బిల్లుల తయారు చేయనున్నారు. ప్రతి నెల 28వ తేదీ నాటికి బిల్లులు తీసుకునే సర్కార్ ఈసారి 25వ తేదీకే బిల్లులు పంపాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారం.. అన్నింటినీ తగ్గించాల్సి ఉండటం.. డీఏలను కలపాల్సి ఉండటంతో  ఏమైనా సమస్యలు వస్తే మూడు రోజుల్లో పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ముందుగానే పంపాలని కోరుతున్నట్లుగా భావిస్తున్నారు. 

Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు

అయితే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం కొత్త పీఆర్సీ ప్రకారం తమకు జీతాలు వద్దని.. పాత పీఆర్సీ ప్రకారమే.. పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంగీకరించే ప్రశ్నే లేదంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల అంగీకారంతో సంబంధం లేకుండా పని పూర్తి చేసుకుని వెళ్లిపోతోంది. వాస్తవానికి సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించినప్పుడు ఉద్యోగసంఘ నేతలందరూ హాజరయ్యారు. ఆయన ప్రకటన పూర్తయిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు కూడా.  అప్పుడు చేసిన ప్రకటననే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తోంది. 

Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు

అయితే సీఎం జగన్ పీఆర్సీ ప్రకటన సమయంలో హెచ్‌ఆర్‌ఏలు.. ఇతర అలవెన్స్‌లు తగ్గిస్తామని నేరుగా చెప్పలేదు. సీఎస్ కమిటీ నివేదికను అమలు చేస్తామని తర్వాత ప్రభుత్వ వర్గాలు ఉద్యోగ సంఘ నేతలకు చెప్పాయి. దీంతో  ఉద్యోగ సంఘ నేతలు భగ్గుమన్నారు. సీఎస్ కమిటీ పూర్తి స్థాయిలో హెచ్‌ఆర్‌ఏ తగ్గింపునకు సిఫార్సు చేయడమే కారణం అయిది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవని చెబుతున్న ప్రభుత్వం.. జీతాలు ఇవ్వడం ద్వారా ఆ విషయాన్ని చెప్పాలనుకుటున్నట్లుగా తెలుస్తోంది. 

Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 20 Jan 2022 01:45 PM (IST) Tags: cm jagan AP government Employees Employees Protests Salaries as per New PRC AP Employees in Movement

సంబంధిత కథనాలు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

మ‌తం ఎదైనా పూజ‌లు ఒక్కటే-బెజ‌వాడ‌ గుణ‌ద‌ల చాలా స్పెషల్

మ‌తం ఎదైనా పూజ‌లు ఒక్కటే-బెజ‌వాడ‌ గుణ‌ద‌ల చాలా స్పెషల్

తెలుగుయువత లీడర్‌ వేధింపులతో బాలిక ఆత్మహత్య- సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు

తెలుగుయువత లీడర్‌ వేధింపులతో బాలిక ఆత్మహత్య- సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు

కర్రల సమరం కాదు- కర్రల సంస్కృతి అంటున్న దేవరగట్టు ప్రజలు

కర్రల సమరం కాదు- కర్రల సంస్కృతి అంటున్న దేవరగట్టు ప్రజలు

Breaking News Telugu Live Updates: కుప్పకూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్, ఒకరు మృతి

Breaking News Telugu Live Updates: కుప్పకూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్, ఒకరు మృతి

టాప్ స్టోరీస్

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?