Amaravati Drone Summit : అమరావతిలో డ్రోన్ హ్యాకథాన్‌లో మీ ప్రతిభ చూపాలనుకుంటున్నారా ? - ఇదిగో ఉచిత అవకాశం
Amaravati : అమరావతి డ్రోన్ సమ్మిట్ కు ఔత్సాహికులైన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉచిత రిజిస్ట్రేషన్‌కు అధికారులు అవకాశం కల్పించారు. ప్రైజ్ మనీ భారీగాపెంచారు.
Aspirants can register for Amaravati Drone Summit: అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ఈ నెల 22-23వ తేదీల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్స్ రాజధానిగా మార్చాన్న చంద్రబాబు ఆశయానికి అనుగణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెషన్‌లో 22న సదస్సు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించే సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహననాయుడుతో పాటు పలువు కేంద్రమంత్రులు పాల్గొంటారు.
ఇప్పటికే డ్రోన్ సమ్మిట్లో పాల్గొనే ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకుంటున్నారు. అమరావతి డ్రోన్ సమ్మిట్‌కు ఔత్సాహికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 400 మంది పోటీకి నమోదు చేసుకున్నారు. రిజిస్ ఔత్సాహికుల సౌలభ్యం కోసం మరో రెండు రోజుల గడువు పెంచినట్లుగా ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ ప్రకటించారు. 17వరకు హ్యాక్‌థాన్ పోటీకి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. హ్యాకథాన్ పోటీకి https://amaravatidronesummit.com/index.html వెబ్ సైటు ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.
త్వరలో చంద్రబాబుకు NSG సెక్యూరిటీ తొలగింపు - కేంద్రం కీలక నిర్ణయం
సదస్సులో భాగంగా 22వ తేదీ సాయంత్రం కృష్ణా నది తీరంలో భారీ ఎత్తున డ్రోన్ షో నిర్వహిస్తారు. ఇప్పటి వరకు దాదాపు 2500 డ్రోన్లతోనే ఇలాంటి ప్రదర్శన చేశారని ఇప్పుడు అంతకు రెట్టింపు డ్రోన్స్‌తో షో చేస్తున్నారు. ఈ షోను చూసేందుకు ప్రజలందరూ తరలి రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఫస్ట్ టైమ్ ఏపీలో ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నామని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరింది.
నారా లోకేష్ కూడా డ్రోన్ సమ్మిట్‌లో పాల్గొనాలని ట్వీట్ చేశారు.
When it comes to advancing drone tech, Andhra Pradesh is rising to the occasion, aiming for the skies. On October 22 and 23, one of India's largest-ever Drone Summits and Expos will be held in Amaravati. That's not all - there will be a drone show featuring 5,500 drones too.… pic.twitter.com/aEjyQVup2y
— Lokesh Nara (@naralokesh) October 16, 2024
డ్రోన్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాంకేతిక సదుపాయాలు, రోజువారీ జీవితంలో, అడ్మినిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి డ్రోన్స్‌ను ఎలా ఉపయోగించాలనే దానిపై ఈ సమ్మిట్‌లో నిపుణులు చర్చిస్తారు. డ్రోన్ అప్లికేషన్స్‌కు సంబంధించి భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడతారు. వరదలు వచ్చినప్పుడు అక్కడ ఎంత మేర నీరు ఉంది, నీటి లోపల ఏముంది, ఎంత మంది చిక్కుకు పోయారు సమస్యలపై ముంబయి, మద్రాస్, తిరుపతి ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో డ్రోన్ కార్పొరేషన్ అధ్యయనం చేసి ఒక పరిష్కారం తీసుకొచ్చే దిశగా పని చేస్తుదంని ప్రభుత్వం చెబుతోంది.