అన్వేషించండి

Breaking News Live:   గురువారం వ్యాక్సినేషన్ ప్రక్రియకు విరామం.. ఆ టైమ్ లో శానిటైజర్ ఉపయోగించొద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా నవంబరు 3న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Breaking News Live:   గురువారం వ్యాక్సినేషన్ ప్రక్రియకు విరామం.. ఆ టైమ్ లో శానిటైజర్ ఉపయోగించొద్దు

Background

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ప్రముఖ సినీ నటుడు విశాల్ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Also Read: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు... టీఆర్ఎస్ ఓట్లు తగ్గలేదు... హుజూరాబాద్ ఫలితంపై మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

అనంతరం ఆలయం వెలుపల విశాల్  మీడియాతో మాట్లాడుతూ.. కాలిబాటన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక నేటితో తీరిందని, ఇంతటి మంచి దర్శనం అందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశాల్ ధన్యవాదాలు తెలియజేశారు.. దీపావళి సందర్భంగా ‘ఎనిమి’ సినిమా విడుదల చేయనున్నాంమని, మా సినీమా కుటుంబ సభ్యుడైన పునీత్ అన్నయ్యను కోల్పోయాం, అన్నయ్య సంకల్పం ఆగి పోకూడదు అని కోరుకున్నాని తెలిపారు.

Also Read: ఈటల రాజేందర్ ఆధిక్యం వెనుక ఎవరి ‘హస్తం’ ఉంది..? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?

‘‘పునీత్ అన్నయ్య చదివిస్తున్న వారిని నేను చదివిస్తా, నేను మరో ఇల్లు కొనుకోవాలని అనుకున్న కానీ ఇల్లు వచ్చే ఏడాది అయినా కొనుకోవచ్చు, కానీ అన్న బాధ్యత తీర్చాలని సంకల్పించా. పునీత్ అన్నయ్య ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చా’’రని విశాల్ గుర్తు చేశారు.

తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రులు కూడా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పనీర్ సెల్వం., సమాచార శాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Also Read: Kurnool Crime: బైక్ పై లవర్ మృతదేహం తరలింపు... హత్యా లేక ప్రమాదమా?

Also Read: వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

Also Read: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు

Also Read: హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్... 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని ట్వీట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

21:02 PM (IST)  •  03 Nov 2021

గురువారం వ్యాక్సినేషన్ ప్రక్రియకు విరామం.. ఆ టైమ్ లో శానిటైజర్ ఉపయోగించొద్దు

తెలంగాణలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్​ ప్రక్రియకు అధికారులు  గురువారం సెలవు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు విరామం ఇస్తున్నట్టు చెప్పారు. తిరిగి శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్​ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుందని తెలిపారు. దీపావళి వేడుకలు నిర్వహించుకునే సమయంలో శానిటైజర్ ఉపయోగించవద్దని అధికారులు సూచించారు.

20:23 PM (IST)  •  03 Nov 2021

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. ఎంతంటే..

దీపావళి పండగ వేళ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. తగ్గించిన ధరలను గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.

19:59 PM (IST)  •  03 Nov 2021

ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి పై దాడి

కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి నటుడిగా పేరు తెచ్చకున్నారు. అలాంటి స్టార్‌ హీరో విజయ్ సేతుపతికి ఎయిర్‌ పోర్టు లో ఊహించని షాక్‌ తగిలింది. విజయ్ సేతుపతిపై ఓ అజ్ఞాత వ్యక్తి ఎయిర్‌ పోర్టు లో దాడి చేశాడు.

19:06 PM (IST)  •  03 Nov 2021

పోలీసుల ఎదుట లొంగిపోయిన 20 మంది మావోయిస్టులు

మావోయిస్టు పార్టీకి చెందిన 20 మంది నక్సల్స్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సునీల్‌దత్‌ మీడియాకు వెల్లడించారు. చర్ల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన 20 మంది ఏడాది కాలంగా సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరారని తెలిపారు. వీరంతా చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ నేతృత్వంలో పనిచేసే వారని తెలిపారు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీలో చేస్తున్న వేధింపులకు తట్టుకోలేకపోయారని తెలిపారు. తరుచుగా తమను బియ్యం, నిత్యావసర వస్తువుల కోసం వీరిని వేధించేవారన్నారు. ఇటీవల వీరిని పెసర్లపాడు, పుట్టపాడు, చందా ప్రాంతాలకు ట్రైనింగ్‌ క్యాంపులకు పంపారని, అక్కడ ఇమడలేక పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారన్నారు. మిగిలిన మావోయిస్టులు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు.

17:12 PM (IST)  •  03 Nov 2021

మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ ఆదాం ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ ఆదాం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు ఏమీ చేయలేకపోతున్నానని తీవ్ర మనోవేదనకు గురైన ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఏ ఒక్కరూ కారణం కాదని తనకు బతకాలని ఆశ లేదని ఈ విషయంలో తన కుటుంబ సభ్యులను ఎవరూ ఏమీ అనొద్దని, విచారణ పేరుతో పోలీసులు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టొద్దని ఆయన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Andhra Pradesh News: ఆ అధికారి కోసం చిలుకూరి బాలాజీ ప్రధాన పూజారి రికమండేషన్ -  ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ
ఆ అధికారి కోసం చిలుకూరి బాలాజీ ప్రధాన పూజారి రికమండేషన్ - ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ
Mahesh Babu : సుకుమార్‌ కూతురు నటించిన 'గాంధీ తాత చెట్టు'పై మహేష్‌ బాబు రివ్యూ - ఏమన్నారంటే!
సుకుమార్‌ కూతురు నటించిన 'గాంధీ తాత చెట్టు'పై మహేష్‌ బాబు రివ్యూ - ఏమన్నారంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bihar DEO Bundles of Cash | అధికారి ఇంట్లో తనిఖీలు..నోట్ల కట్టలు చూసి షాక్ | ABP DesamRam Gopal Varma Convicted Jail | సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీకి జైలు శిక్ష | ABP DesamNara Lokesh Davos Interview | దావోస్ సదస్సుతో ఏపీ కమ్ బ్యాక్ ఇస్తుందన్న లోకేశ్ | ABP DesamCM Chandrababu Naidu Davos Interview | మనం పెట్టుబడులు అడగటం కాదు..మనోళ్లే ఎదురు పెడుతున్నారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Andhra Pradesh News: ఆ అధికారి కోసం చిలుకూరి బాలాజీ ప్రధాన పూజారి రికమండేషన్ -  ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ
ఆ అధికారి కోసం చిలుకూరి బాలాజీ ప్రధాన పూజారి రికమండేషన్ - ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ
Mahesh Babu : సుకుమార్‌ కూతురు నటించిన 'గాంధీ తాత చెట్టు'పై మహేష్‌ బాబు రివ్యూ - ఏమన్నారంటే!
సుకుమార్‌ కూతురు నటించిన 'గాంధీ తాత చెట్టు'పై మహేష్‌ బాబు రివ్యూ - ఏమన్నారంటే!
Meerpet News Today: మీర్‌పేట హత్య కేసులో బిగ్ ట్విస్ట్- గురుమూర్తి సెల్‌ఫోన్‌ చూసిన షాకైన పోలీసులు
మీర్‌పేట హత్య కేసులో బిగ్ ట్విస్ట్- గురుమూర్తి సెల్‌ఫోన్‌ చూసిన షాకైన పోలీసులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 186శాతం పెన్షన్ పెరుగుదల అందుతుందా?
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 186శాతం పెన్షన్ పెరుగుదల అందుతుందా?
2025 Suzuki Access 125 : న్యూ సుజుకి యాక్సెస్ 125..  మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. ధర తెలిస్తే షాకే
న్యూ సుజుకి యాక్సెస్ 125.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. ధర తెలిస్తే షాకే
Embed widget