Kurnool Crime: బైక్ పై లవర్ మృతదేహం తరలింపు... హత్యా లేక ప్రమాదమా?
కర్నూలు జిల్లాలో బైక్ పై యువతి మృతదేహం తరలింపు సంచలనంగా మారింది. యువతి ప్రేమికుడు హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని యువకుడు అంటున్నాడు.
కర్నూలు జిల్లాలో ఓ యువకుడి యువతి మృతదేహాన్ని బైక్ తీసుకెళ్లడం సంచలనంగా మారింది. పెళ్లి చేసుకుందామని తీసుకెళ్లిన యువతి ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడిపోవడంతో తలకు తీవ్రగాయమై చనిపోయిందని ఆ యువకుడు తెలిపాడు. దీంతో ఆమె మృతదేహాన్ని బైక్ పై ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. మార్గమధ్యలో పోలీసులు యువకుడు ఆపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కానీ యువతి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని మంగళవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.
Also Read: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు
మేనమామతో నిశ్చితార్థం
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లికి చెందిన అరుణ, ప్రకాశం జిల్లా మార్కాపురం లక్ష్మీ నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు ప్రేమించుకున్నారు. బీటెక్ చదువుకునేటప్పుడు వీరి మధ్య ప్రేమ పుట్టింది. అయితే 2 రోజుల క్రితం అరుణకు తన మేనమామ కొడుకుతో నిశ్చితార్థం చేశారు. ఈ నెల 20న పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి కోసం సోమవారం ఉదయం తల్లిదండ్రులు, బంధువులు అందరూ కలిసి బంగారం కొనేందుకు కర్నూలుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు మార్కాపురం నుంచి బైక్‌పై బొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి వచ్చి యువతిని తీసుకెళ్లాడు.
Also Read: భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం
హత్యా లేక ప్రమాదమా...?
బేతంచెర్ల మండలం యంబాయి గ్రామం దగ్గర ప్రమాదవశాత్తు బైక్ మీద నుంచి అరుణ కింద పడింది. తలకు గాయం కావవడంతో ఆమెను సమీప ప్రాథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లాడు యువకుడు. అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన అరుణ మృతదేహాన్ని వెంకటేశ్వర్లు బైక్ పై తీసుకెళ్లాడు. ఆసుపత్రి సిబ్బంది తీసుకెళ్లవద్దని వారించ్చినప్పటికీ అతడు వినకుడా మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తుండగా పాణ్యం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని వెల్దుర్తి పోలీసులకు అప్పగించారు. అరుణ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, వెంకటేశ్వర్లు హత్య చేశాడని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఇది హత్య.. లేక ప్రమాదమా అని తేలాల్సి ఉంది.
Also Read: ఫ్రెండ్స్‌తో కలిసి రాత్రిపూట సిట్టింగ్.. ఇంతలో పోలీస్ సైరన్, ముంచుకొచ్చిన మృత్యువు
కుటుంబ సభ్యుల ఆందోళన
డోన్ డీఎస్పీ శ్రీనివాస్, నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు. యువతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. కలెక్టరేట్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల ఆందోళన చేశాయి. నిందితుడు వెంకటేశ్వర్లును కఠినంగా శిక్షించి, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి