Huzurabad ByPoll Results: ఈటల రాజేందర్ ఆధిక్యం వెనుక ఎవరి ‘హస్తం’ ఉంది..? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అయితే కౌంటింగ్ సరళి చూస్తున్న వారు ఆయన కాంగ్రెస్ ఓటర్లతోనే గట్టెక్కుతున్నట్లుగా ఉందని విశ్లేషిస్తున్నారు.
హుజురాబాద్ ఉపఎన్నికల్లో హోరాహోరీ నడుస్తోంది. అయితే తక్కువలో తక్కువ అయినా ప్రతి రౌండ్‌లోని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌నే ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. పోలైన ఓట్లన్నీ దాదాపుగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులే పంచుకున్నారు. బరిలో ఉన్న మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ మాత్రం కనీస ఓట్లు సాధించలేకపోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా గుంపగుత్తగా ఈటల రాజేందర్ వైపు వెళ్లినట్లుగా కనిపిస్తోంది. ఈ ఓట్ల బలంతోనే టీఆర్ఎస్‌ను ఈటల సులువుగా ఎదుర్కొంటున్నారని భావిస్తున్నారు.
Also Read : హుజూరాబాద్‌లో గుర్తుల గోల.. టీఆర్ఎస్, బీజేపీ కొంప ముంచుతున్న ఆ రెండు సింబల్స్
ఎంత హోరా హోరీ పోరు జరిగినా కాంగ్రెస్ పార్టీకి కనీసం పది శాతం ఓట్లు అయినా వస్తాయని అంచనా వేశారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ క్యాడర్ గుంపగుత్తగా ఈటల వైపు వెళ్లారని ఈ ఫలితాల సరళిని బట్టి అంచనా వేయవచ్చు. కాంగ్రెస్ - బీజేపీ కలిసి టీఆర్ఎస్‌పై కుట్ర పన్నాయని కేటీఆర్ చాలా రోజులుగా ఆరోపిస్తున్నాయి. కుట్ర పన్నాయో లేదో కానీ టీఆర్ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లుగా తెలుస్తోంది.
Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
కాంగ్రెస్ ఓట్లు ఈటల వైపు మొబిలైజ్ కావడానికి టీఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా ఓ కారణం అని చెప్పుకోవచ్చు. హుజురాబాద్‌లో గతంలో బీజేపీకి నోటాతో పాటుగా కూడా ఓట్లు వచ్చేవి కావు. కానీ ఈసారి విజయం దిశగా సాగిందంటే.. ఈటల రాజేందర్ పరపతికి తోడు కాంగ్రెస్ సాయం కలసి వచ్చిందనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అభ్యర్థి ఖరారు దగ్గర్నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం ఆలస్యం వరకూ అన్నీ కావాలనే చేశారని టీఆర్ఎస్ వర్గాలు కొంతకాలం నుంచి చెబుతున్నాయి.
హుజురాబాద్‌లో బీజేపీకి ఎలాంటి నిర్మాణం లేదు. కార్యకర్తలు లేరు. ఈటల రాజేందర్ వెంట ఉన్న టీఆర్ఎస్ నేతలందర్నీ ..తమ పార్టీలోనే ఉంచుకోవడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది. దీంతో ఒంటరి అయిపోయిన ఈటల .. తన సొంత బలంతోనే నెగ్గుకు రాగలిగారు. కాంగ్రెస్ లోపాయికారీగా సహకరించింది.