అన్వేషించండి

Huzurabad Bypoll Result: హుజూరాబాద్‌లో గుర్తుల గోల.. టీఆర్ఎస్, బీజేపీ కొంప ముంచుతున్న ఆ రెండు సింబల్స్

ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారాయి. రెండు రకాల గుర్తులు టీఆర్ఎస్, బీజేపీ గుర్తులను పోలి ఉండడం నేతలకు టెన్షన్ పుట్టిస్తోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల సమయానికి మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. ఆ మూడింటిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఈ ఫలితాలు వెల్లడయ్యే క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలి రెండు రౌండ్లలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ఇతర ఇండిపెండ్లకు వచ్చిన ఓట్ల సంఖ్యను చూస్తే ఆ విషయం అర్థమవుతోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండిపెండెంట్, మనుగడలో లేని పార్టీలకు చెందిన అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా రెండు రకాల గుర్తులు టీఆర్ఎస్, బీజేపీ గుర్తులను పోలి ఉండడం ఆ పార్టీ నేతలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఓట్ల లెక్కింపు కొనసాగే క్రమంలో ఆ రెండు గుర్తులకు వస్తున్న ఓట్లు దీనికి మరింత బలం చేకూరుస్తోంది.

ఉప ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

కాంగ్రెస్‌కు ఓట్లకు చేరువగా ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి ఓట్లు
ప్రజా ఏక్తా పార్టీ తరపున పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థికి తొలి రౌండ్‌లో 122 ఓట్లు రాగా.. రెండో రౌండ్‌లో 158 ఓట్లు వచ్చాయి. ఈయన ఎన్నికల గుర్తు రోటీ మేకర్. దాదాపు కాంగ్రెస్ అభ్యర్థికి సమీప సంఖ్యలో ఈయనకు ఓట్లు రావడం విశేషం. కాంగ్రెస్‌కు రెండు రౌండ్లలో కలిపి 339 ఓట్లు వచ్చాయి. రోటీ మేకర్ గుర్తు దాదాపు కారు గుర్తును పోలినట్లుగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇండిపెండెంట్లు అందరికీ సింగిల్ లేదా డబుల్ డిజిట్లలో ఓట్లు రాగా.. సిలివేరు శ్రీకాంత్ అనే వ్యక్తికి రెండు రౌండ్లలో కలిపి 280 ఓట్లు వచ్చాయి. రోటీ మేకర్ గుర్తు కారును పోలి ఉండడం వల్ల కొంత మంది ఓటర్లు రోటీ మేకర్‌నే కారుగా భావించి ఓటు వేసి ఉంటారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.Huzurabad Bypoll Result: హుజూరాబాద్‌లో గుర్తుల గోల.. టీఆర్ఎస్, బీజేపీ కొంప ముంచుతున్న ఆ రెండు సింబల్స్

అంతేకాకుండా కంటే సాయన్న అనే వ్యక్తి గుర్తు కూడా ఓటర్లను తికమక పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సాయన్న అనే వ్యక్తి ఎన్నికల గుర్తు వజ్రం. ఇది కాస్త కమలం గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు తికమక అయినట్లుగా తెలుస్తోంది. ఈయనకు రెండు రౌండ్లలో కలిపి ఏకంగా 190 ఓట్లు వచ్చాయి. వజ్రం గుర్తు కమలం గుర్తును పోలి ఉండడం వల్ల ఓటర్లు తికమక పడి ఉంటారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
Huzurabad Bypoll Result: హుజూరాబాద్‌లో గుర్తుల గోల.. టీఆర్ఎస్, బీజేపీ కొంప ముంచుతున్న ఆ రెండు సింబల్స్

Also Read: Huzurabad, Badvel Bypoll Results Live: మూడో రౌండ్‌లోనూ ఈటల ముందంజ.. మొత్తం 1269 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Embed widget