Huzurabad election results: హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్... 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని ట్వీట్
హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని తెలిపారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. మొత్తం 23, 865 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై విజయం సాధించారు. సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య జరుగుతున్న ఎన్నికలుగా బీజేపీ అభివర్ణించింది. ఇరు పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు వడ్డాయి. వాడీవేడిగా జరిగిన బైపోల్ లో చివరకు గెలుపు ఈటలను వరించింది.
Also Read: హుజురాబాద్‌లో గెలుపు ఈటలదా ? బీజేపీదా ?
Would like to thank & applaud the tireless efforts of @trsharish Garu, @Koppulaeshwar1 Garu @GKamalakarTRS Garu and all the MLAs & TRS party leaders & cadre who have toiled hard in Huzurabad
— KTR (@KTRTRS) November 2, 2021
Also would like to thank the social media warriors who’ve been relentless in campaign
20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం : మంత్రి కేటీఆర్
హుజూరాబాద్ బైపోల్ ఫలితాలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఒక్క ఎన్నిక ఫలితం పార్టీని ప్రభావితం చేయలేదన్నారు. గత 20 ఏళ్లలో టీఆర్‌ఎస్ పార్టీ అనేక ఎత్తుపల్లాలను చూసిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వారియర్స్ కూడా శక్తి వంచనలేకుండా ప్రచారం చేశారన్నారు. గెల్లు శ్రీనివాస్ స్ఫూర్తిదాయక పోరాటం చేశారని తెలిపారు. హుజూరాబాద్ ఫలితాలు వెలువడిన తర్వాత కేటీఆర్ ట్వీట్ చేశారు.
Also Read: ఈటల రాజేందర్ ఆధిక్యం వెనుక ఎవరి ‘హస్తం’ ఉంది..? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. 23 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఈటల విజయం సాధించారు. ఈటల సెంటిమెంట్ ముందు టీఆర్ఎస్ ఎత్తుగడలు పనిచేయలేదు. దళిత బంధు ప్రభావం ఎన్నికలపై కనిపించలేదు.
Also Read: గెలుపు బావుటా ఎగరేసిన ఈటల.. ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం