By: ABP Desam | Updated at : 24 Dec 2021 03:12 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఒమిక్రాన్ కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
విశాఖలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. యూఏఈ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు అధికారులు. డిసెంబర్ 15న విశాఖ వచ్చిన వ్యక్తికి జ్వరం రావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత జీనోమ్ స్వీక్వెన్సింగ్ టెస్ట్ కి పంపించగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆ వ్యక్తిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Also Read: మహారాష్ట్రలో ఒక్కరోజే 23 ఒమిక్రాన్ కేసులు... భయపెడుతున్న కేసుల సంఖ్య
Two more people in #AndhraPradesh were tested positive for #Omicron adding the total count to four. Both the people are healthy and kept under observation of the health department officials.
Everyone is requested to follow the #COVIDAppropriateBehaviour and stay safe pic.twitter.com/tJTL2FhDZn— ArogyaAndhra (@ArogyaAndhra) December 24, 2021
ఏపీలో ఒమిక్రాన్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన 41 ఏళ్ల మహిళతో పాటు విశాఖకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. తాజాగా కేసులతో ఏపీలో ఒమిక్రాన్ కేసులు 4కు చేరాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ఈనెల 19న కువైట్ నుంచి, విశాఖకు చెందిన వ్యక్తి ఈనెల 15న యూఏఈ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ క్వారంటైన్ ఉన్నారని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి ఏపీకి 53 మంది వచ్చారని, వారిలో 9 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించామని తెలిపింది. తాజాగా నమోదైన ఒమిక్రాన్ కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది.
ఒమిక్రాన్ బాధితులకు అందించే ఔషధాలు
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు ఇస్తున్న ఔషధాలపై ఆసక్తి ఏర్పడింది. స్వల్ప లక్షణాలే కనిపిస్తుండటం, ప్రాణవాయువు అవసరం లేకపోవడంతో ప్రజలు, వైద్యులు, ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. దిల్లీలోని వైద్యశాలలో ఒమిక్రాన్ బాధితులకు కేవలం మల్టీ విటమిన్లు, పారాసిటమాల్‌తోనే వైద్యం చేస్తున్నారని తెలిసింది. ఇంకా మరేమీ ఇవ్వడం లేదు. దిల్లీలోని లోక్‌నాయక్ ఆస్పత్రిలో ఒమిక్రాన్ పేషెంట్లకు కేవలం మల్టీ విటమిన్లు, పారాసిటమాల్ మాత్రమే ఇస్తున్నామని అక్కడి వైద్యులు చెబుతున్నారు. మరే ఔషధాలు అవసరం పడటం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో 40 మంది ఒమిక్రాన్ బాధితులకు చికిత్స అందించారు. అందులో 19 మందిని ఇప్పటికే డిశ్చార్జి చేశారు.
'బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలేమీ కనిపించడం లేదు. అసింప్టమాటిక్‌గా ఉంటున్నారు. మిగిలిన వారికి గొంతు నొప్పి, తక్కువ స్థాయి జ్వరం, ఒళ్లునొప్పుల వంటి స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. చికిత్సలో భాగంగా వారికి కేవలం మల్టీ విటమిన్లు, పారాసిటమాల్ మాత్రలు ఇస్తున్నాం. మరే ఇతర ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం కనిపించడం లేదు' అని ఎల్‌ఎన్‌జేపీలోని సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు.
Also Read: ఒమిక్రాన్ చికిత్స..! దిల్లీలో పేషెంట్లకు ఇస్తున్న మందులివే..!
Breaking News Live Telugu Updates: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలుతున్న భవనాలు
Tirumala News: శ్రీవారి దర్శనానికి వీరికి 24 గంటల టైం, ఈ టోకెన్లు ఉంటే చాలా త్వరగా
Weather Latest Update: నేడు ఈ 13 జిల్లాల్లో అధిక చలి! ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందంటే
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?
DMHO Recruitment: కృష్ణా జిల్లా, డీఎంహెచ్‌వోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
BRS Chief KCR : దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు - కేసీఆర్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్