Omicron Treatment: ఒమిక్రాన్ చికిత్స..! దిల్లీలో పేషెంట్లకు ఇస్తున్న మందులివే..!
ఒమిక్రాన్ బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలేమీ కనిపించడం లేదు. కొందరికి గొంతు నొప్పి, తక్కువ స్థాయి జ్వరం, ఒళ్లునొప్పులు కనిపిస్తున్నాయి. వారికి ఏ మందులు ఇస్తున్నారంటే..
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు ఇస్తున్న ఔషధాలపై ఆసక్తి ఏర్పడింది. స్వల్ప లక్షణాలే కనిపిస్తుండటం, ప్రాణవాయువు అవసరం లేకపోవడంతో ప్రజలు, వైద్యులు, ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. దిల్లీలోని వైద్యశాలలో ఒమిక్రాన్ బాధితులకు కేవలం మల్టీ విటమిన్లు, పారాసిటమాల్‌తోనే వైద్యం చేస్తున్నారని తెలిసింది. ఇంకా మరేమీ ఇవ్వడం లేదు.
దిల్లీలోని లోక్‌నాయక్ ఆస్పత్రిలో ఒమిక్రాన్ పేషెంట్లకు కేవలం మల్టీ విటమిన్లు, పారాసిటమాల్ మాత్రమే ఇస్తున్నామని అక్కడి వైద్యులు చెబుతున్నారు. మరే ఔషధాలు అవసరం పడటం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో 40 మంది ఒమిక్రాన్ బాధితులకు చికిత్స అందించారు. అందులో 19 మందిని ఇప్పటికే డిశ్చార్జి చేశారు.
'బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలేమీ కనిపించడం లేదు. అసింప్టమాటిక్‌గా ఉంటున్నారు. మిగిలిన వారికి గొంతు నొప్పి, తక్కువ స్థాయి జ్వరం, ఒళ్లునొప్పుల వంటి స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. చికిత్సలో భాగంగా వారికి కేవలం మల్టీ విటమిన్లు, పారాసిటమాల్ మాత్రలు ఇస్తున్నాం. మరే ఇతర ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం కనిపించడం లేదు' అని ఎల్‌ఎన్‌జేపీలోని సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు.
ఎక్కువగా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల్లోనే కొవిడ్-19 పాజిటివ్ కనిపిస్తోందని ఆ వైద్యుడు పేర్కొన్నారు. దాదాపుగా వారందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారేనని వెల్లడించారు. అందులో కొందరు బూస్టర్ డోసు తీసుకున్నవారూ ఉన్నారని వివరించారు. ఒక ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో ఆఫ్రికా దేశానికి చెందిన ఒక ఎంపీ, నార్త్ ఇండియాలోని ఓ రాష్ట్రానికి చెందిన రాజ కుటుంబం సభ్యుడు, సీనియర్ అధికారుల కుటుంబీకులు ఉన్నారని అక్కడి వర్గాలు వెల్లడించాయి.
మొత్తంగా దిల్లీలో 67 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక చెబుతోంది. అందులో 23 మంది డిశ్చార్జీ అయ్యారు. దిల్లీ తర్వాత అత్యధిక ఒమిక్రాన్ కేసులో మహారాష్ట్ర, తెలంగాణలోనే ఉండటం గమనార్హం. కొత్త వేరియెంట్ కట్టడికి, వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్ష జరిగింది. అవసరమైతే రాత్రి కర్ఫ్యూలు పెట్టాలని ఆదేశాలు అందాయి. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ పెట్టారు. చాలా ప్రాంతాల్లో క్రిస్‌మస్, కొత్త సంవత్సరం వేడుకలను నిషేధించారు.
Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్ మస్క్! టెస్లా నుంచి మొబైల్ ఫోన్.. ఫీచర్లు ఇవే!!
Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్
Also Read: Cryptocurrency Prices Today: రూ.3 లక్షల కోట్లు తగ్గిన బిట్‌కాయిన్, ఎథిరియమ్ విలువ.. మిగతావీ??
Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్ లిస్టింగ్ సూపర్‌హిట్.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?
Also Read: Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త కారు వచ్చేస్తుంది... వావ్ అనిపించే లుక్, డిజైన్లు
Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.