అన్వేషించండి

AP Omicron Cases: ఏపీలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు... 24కు చేరిన మొత్తం కేసులు

ఏపీలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 24కు చేరాయి.

ఏపీలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 24కు చేరాయి. ఒమన్‌ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్‌ నుంచి ఇద్దరు, అమెరికా, సుడాన్‌, గోవా నుంచి ఒక్కొక్కరి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఒమిక్రాన్‌ బాధితుల్లో ముగ్గురు కృష్ణా జిల్లాకు చెందిన వారు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు చొప్పున ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Also Read: విజయనగరం జిల్లాలో కరోనా కలకలం... కొత్తవలస పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఒక టీచర్ కు పాజిటివ్

కొత్తగా 334 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు చేశారు. 334 మందికి వైరస్ సోకింది. వైరస్ కారణంగా.. ఒకరు చనిపోయారు. కరోనా నుంచి మరో 95 మంది బాధితులు బయటపడ్డారు. ప్రస్తుతం ఏపీలో 1,516 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

Also Read: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. థర్డ్ వేవ్ వైపు పయనిస్తున్నామా?

తెలంగాణలో 1052 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గతేడాది జూన్ తర్వా తొలిసారి రాష్ట్రంలో 1000 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,991 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 1,052 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,84,023కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ లో ఈ గణాంకాలు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4,033కి చేరింది. కరోనా నుంచి మరో 240 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,858 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని  వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Also Read: తెలంగాణలో కోవిడ్ విజృంభణ... ఒక్క రోజే 1052 కరోనా కేసులు... కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు..

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 144కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి 127 మంది శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారందరికీ కోవిడ్‌ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించి పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి 13,405 మంది ప్రయాణికులు హైదరాబాద్ వచ్చారు. వీరందరికీ కోవిడ్ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా 189 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరి శాంపిల్స్ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 45 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌ అని తేలింది. మిగిలిన 144 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకూ ఒమిక్రాన్‌ బాధితుల్లో 37 మంది కోలుకున్నారు. మరో 50 మంది ఫలితాలు రావాల్సి ఉంది. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget