అన్వేషించండి

Social Media: ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ - సాధ్యమవుతుందా?

AP government: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. అయితే అమలు సాధ్యంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

AP government is considering banning social media for children: మారుతున్న కాలంతో పాటు సాంకేతికత అందిస్తున్న ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువగా పొంచి ఉన్నాయన్న ఆందోళనల కారణంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయానికి సిద్ధమవుతోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఐటీ ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడంతో, ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు నమూనాగా నిలిచే ఈ నిర్ణయం చిన్నారుల భవిష్యత్తును కాపాడే దిశగా ఒక కీలక అడుగుగా కనిపిస్తోంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన సోషల్ మీడియా నిషేధ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేస్ స్టడీగా తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కేవలం స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంది కదా అని ప్రతి కంటెంట్‌ను చూసే అవకాశం ఇవ్వడం వల్ల పిల్లలు మానసిక పరిణతి చెందకముందే తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్నెట్ ప్రపంచంలో వడపోత లేకుండా వచ్చే సమాచారాన్ని విశ్లేషించే శక్తి చిన్న వయసులో ఉండదని, ఇది వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు సైబర్ బుల్లీయింగ్, అశ్లీలత , సోషల్ మీడియా వ్యసనం. గంటల తరబడి రీల్స్ చూస్తూ కాలక్షేపం చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడమే కాకుండా, వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్లే జీవితం అనుకునే భ్రమలో చిన్నారులు తమ బాల్యాన్ని కోల్పోతున్నారన్న నిపుణుల హెచ్చరిస్తున్నారు. అందుకే ఒక  సేఫ్ ఆన్‌లైన్ ఎకోసిస్టమ్ ను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.                      

అయితే, ఈ నిషేధం అమలు చేయడం అనేది సాంకేతికంగా ఒక పెద్ద సవాలు. పిల్లల వయస్సును నిర్ధారించే  ఏజ్ వెరిఫికేషన్  టెక్నాలజీని పకడ్బందీగా ఎలా అమలు చేయాలి? గ్లోబల్ సోషల్ మీడియా దిగ్గజాలు ఈ నిబంధనలకు సహకరిస్తాయా? అనే కోణంలో ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది. కేవలం నిషేధించడమే కాకుండా, పిల్లలను విద్యాపరమైన, సృజనాత్మకమైన కంటెంట్ వైపు మళ్లించేలా ప్రత్యామ్నాయ వేదికలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.                              

చివరికి, ఈ లక్ష్యం నెరవేరాలంటే చట్టంతో పాటు సామాజిక మార్పు కూడా అవసరం. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినప్పటికీ, తల్లిదండ్రులలో అవగాహన రానంత వరకు ఇది పూర్తిస్థాయిలో సాధ్యం కాదు. ఇంట్లోనే పిల్లల డిజిటల్ అలవాట్లపై పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు చిన్నారుల మానసిక ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకు న్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, దేశంలోనే ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టిస్తుంది.                 

టాప్ హెడ్ లైన్స్

AP Mega DSC Politics: డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget