
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
AP Assembly Chief Whip | టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ఏపీ శాసనసభలో చీఫ్ విప్‌గా, ఎమ్మెల్యే పంచుమర్తి అనురాధను మండలిలో చీఫ్ విప్‌లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రకటన వచ్చింది.

AP government appoints chief whip and whips in state assembly | అమరావతి: ఏపీ శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్, విప్‌ల నియామకంపై ఉత్కంఠ తొలగింది. ఏపీ శాసనసభలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు (టీడీపీ ఎమ్మెల్యే), శాసన మండలిలో చీఫ్‌విప్‌గా టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధలను ఏపీ ప్రభుత్వం నియమించింది. శాసనసభలో మిత్రపక్షాలు జనసేన నుంచి ముగ్గురు, ఒక బీజేపీ ఎమ్మెల్యేకు విప్ లుగా సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అంతకుముందు మంగళవారం సాయంత్రం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీని నడపటం, సఖ్యతగా నడుచుకోవాలని లేకపోతే కెరీర్ ఖతం అంటూ హెచ్చరించారు.
శాసనసభలో విప్‌లు వీరే..
- అరవ శ్రీధర్, కోడూరు -ఎస్సీ(జనసేన)
- ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు(బీజేపీ)
- బెందాళం అశోక్ - ఇచ్ఛాపురం (టీడీపీ)
- బొండా ఉమామహేశ్వరరావు- విజయవాడ సెంట్రల్ (టీడీపీ)
- బొలిశెట్టి శ్రీనివాస్- తాడేపల్లిగూడెం (జనసేన)
- బొమ్మిడి నారాయణ నాయకర్- నరసాపురం (జనసేన)
- యనమల దివ్య- తుని (టీడీపీ)
- దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు)- ముమ్మిడివరం (టీడీపీ)
- కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం (టీడీపీ)
- వి.ఎం.థామస్- గంగాధర నెల్లూరు(ఎస్సీ) (టీడీపీ)
- మాధవి రెడ్డప్పగారి - కడప (టీడీపీ)
- జగదీశ్వరి తోయక - కురుపాం(ఎస్టీ) (టీడీపీ)
- పీజీవీఆర్ నాయుడు(గణబాబు)- విశాఖ వెస్ట్(టీడీపీ)
- తంగిరాల సౌమ్య- నందిగామ (ఎస్సీ) (టీడీపీ)
- యార్లగడ్డ వెంకట్రావు- గన్నవరం (టీడీపీ)
ఏపీ శాసన మండలిలో విప్‌లు
- పి.హరిప్రసాద్ (జనసేన)
- వేపాడ చిరంజీవి రావు(టీడీపీ)
- కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
