అన్వేషించండి

AP DSC Selection List 2025: ఏపీ డీఎస్సీ సెలెక్షన్ లిస్ట్‌పై అభ్యర్థులకు కీలక అప్‌డేట్, ఇక నో వెయిటింగ్ అని క్లారిటీ

AP Mega DSC Selection List | ఏపీ డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేసిన తరువాత రాష్ట్ర పాఠశాల విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ.. 15,941 మంది పోస్టుల భర్తీ చేసినట్లు తెలిపారు.

AP Mega DSC Selection List 2025 | అమరావతి: ఏపీ డీఎస్సీ ద్వారా ఎంతో పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 150 రోజుల్లో పూర్తిచేసి, సెలెక్టెడ్ అభ్యర్థుల తుది జాబితాను జారీ చేశామని రాష్ట్ర పాఠశాల విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయరామ రాజుతో కలసి మీడియాతో మాట్లాడారు. నేడు చాలా శుభదినం అని, ఉపాధ్యాయులుగా ఎంపికైన  అయిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ (AP DSC Selection List 2025) అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు.

  సెలక్షన్ లిస్ట్‌ లింక్ ఇదే 

కేవలం 150 రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా DSC-2025 నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత పారదర్శక ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అని కోన శశిధర్ తెలిపారు. ఈ ప్రక్రియ 2024 జూన్ 13వ తేదీన జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 27తో మొదలైంది.  ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశాలు కల్పించడానికి, ప్రభుత్వం అక్టోబర్ 2024లో రెండవసారిగా టెట్ పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. 100కు పైన కేసులు పెట్టినా ఏ ఆటంకం లేకుండా, విమర్శలకు తావు లేకుండా DSCని నిర్వహించామని, కేవలం 150 రోజుల్లో మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని వివరించారు. డ్రాఫ్ట్ కీ పై లక్ష 40 వేల అభ్యంతరాలు వచ్చినా అన్నిటినీ సమర్ధంగా జవాబు ఇచ్చామని తెలిపారు.   సెలక్షన్ లిస్ట్‌ లింక్ ఇదే 

వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు

గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ 77, తేదీ ఆగస్టు 2, 2023 కింద వర్టికల్, మొట్ట మొదటిసారిగా హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేశామని చెప్పారు. మొదటిసారిగా SC సబ్ క్లాసిఫికేషన్‌ను రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ 46, తేదీ ఏప్రిల్ 19, 2025 కింద ప్రవేశపెట్టామని వివరించారు. అదనంగా గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ 47 ప్రకారం మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్‌కు 3% రిజర్వేషన్ అమలు చేశామని తెలిపారు. ఈ నియామకాలు ప్రభుత్వ, పంచాయతీరాజ్, మునిసిపల్ పాఠశాలలు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్స్ కింద ఉన్న పాఠశాలలకు విస్తరించామని చెప్పారు.


AP DSC Selection List 2025: ఏపీ డీఎస్సీ సెలెక్షన్ లిస్ట్‌పై అభ్యర్థులకు కీలక అప్‌డేట్, ఇక నో వెయిటింగ్ అని క్లారిటీ

జూన్ 6 నుంచి జులై 2 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణ

అభ్యర్థుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఏప్రిల్ 20 మరియు మే 15, 2025 మధ్య కాలంలో 3,36,300 అభ్యర్థుల నుండి 5,77,675 దరఖాస్తులు వచ్చాయ్నారు. ముఖ్యంగా 87% అభ్యర్థులు వారి మొదటి ప్రాధాన్యత పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్లు తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూన్ 6 నుండి జులై 2, 2025 వరకు రెండు షిఫ్టుల్లో పటిష్టమైన భద్రతా చర్యలతో నిర్వహించారు. ప్రాథమిక సమాధానాల కీ జులై 5న విడుదల చేసి, జులై 12 వరకు అభ్యంతరాలు స్వీకరించి, నిపుణుల సమీక్ష తర్వాత ఆగస్టు 1న ఫైనల్ కీ ప్రచురించామని పేర్కొన్నారు.

పెద్ద సంఖ్యలో అభ్యర్థులు, కొన్ని కేటగిరీలకు షిఫ్టుల కారణంగా (69 కేటగిరీలలో 9 కేటగిరీలకు), జాతీయంగా గుర్తించిన నార్మలైజేషన్ పద్ధతిని ఈ 9 కేటగిరీ పోస్టులకు అవలంబించామని చెప్పారు. అన్ని సెషన్లలో న్యాయబద్ధతను నిర్ధారించడానికి మెరిట్ జాబితాలను TET స్కోర్‌ల నుండి 20% వెయిటేజ్ మరియు DSC స్కోర్‌ల నుండి 80% వెయిటేజ్‌తో తయారు చేశామని కోన శశిధర్ వివరించారు.

ఏడు రౌండ్లలో వెరిఫికేషన్ ప్రక్రియ

సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్టు 28 మరియు సెప్టెంబర్ 13, 2025 మధ్య ఏడు రౌండ్లలో ప్రత్యేక జిల్లా స్థాయి టీమ్‌లతో నిర్వహించామని చెప్పారు. వైకల్యాలతో ఉన్న అభ్యర్థుల వైద్య వెరిఫికేషన్‌ను జిల్లా వైద్య అధికారుల పర్యవేక్షణలో, బ్లైండ్, హియరింగ్ ఇంపెయిర్డ్, ఆర్థోపెడిక్ మరియు MR కేటగిరీలలో వైద్య నిపుణుల సహకారంతో నిర్వహించామని వివరించారు. అభ్యర్థులకు సహాయం చేయడానికి రాష్ట్ర స్థాయి ఇన్ఫర్మేషన్ అసిస్టెన్స్ సెంటర్‌ను స్థాపించి IT సిస్టమ్‌లతో సమన్వయం చేశామని చెప్పారు. రియల్ టైమ్ గ్రీవెన్స్ రీడ్రెసల్‌కు అదనంగా, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లను రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేసి పరీక్షల సమయంలో నిరంతర పర్యవేక్షణ నిర్వహించామని కోన శశిధర్ తెలిపారు.

మెగా DSC-2025 అనేక చారిత్రాత్మక మైలురాళ్లను సృష్టించిందని, ఇది SC సబ్ క్లాసిఫికేషన్‌ను అమలు చేసిన మొదటి నియామకం, కొత్త 3% కోటా కింద 372 పోస్టులను స్పోర్ట్స్ పర్సన్స్‌తో భర్తీ చేసిన మొదటిది, మరియు మహిళలు, PWDs, మాజీ సైనికులు మరియు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్‌తో సహా అన్ని కేటగిరీలలో వర్టికల్ మరియు హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేసిన మొదటిదని వివరించారు.

అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

సూక్ష్మ వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత 15,941 అభ్యర్థులతో ఫైనల్ సెలెక్షన్ లిస్టులను తయారు చేశామని చెప్పారు. మిగిలిన 406 ఖాళీలు సంబంధిత కమ్యూనిటీలో అర్హత పొందిన అభ్యర్థుల అందుబాటులేకపోవడంతో భర్తీ కాలేదని, ఈ ఖాళీలను తదుపరి DSC నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తామని వివరించారు. ఈ సెలెక్షన్ లిస్టులు జిల్లా విద్యా కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు మరియు అధికారిక మెగా DSC వెబ్‌సైట్ (www.apdsc.apcfss.in)లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఈ క్రింది ఫోన్ నంబర్లు (8125046997, 9398810958, 7995649286, 7995789286) ద్వారా సహాయం అందుకోవచ్చు అన్నారు. 

నో సెకండ్ లిస్ట్, వెయిటింగ్ లిస్ట్..

సెలెక్ట్ అయిన 15,941 మందిలో 7,955 మహిళలు, 7,986 పురుషులు ఉన్నారని, అంటే 49.9% మహిళలు, 50.1% పురుషులు అని వివరించారు. మహిళలకు దాదాపు 50% సాధించడం హర్షనీయ విషయమని చెప్పారు. ఈ లిస్ట్‌కు వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదని స్పష్టం చేశారు. కార్యదర్శి మాట్లాడుతూ “మెగా DSC 2025 పారదర్శకత, సమైక్యత మరియు న్యాయబద్ధతలో కొత్త ప్రమాణాలను నిర్దేశించిందని, పదహారు వేలకు మించిన కొత్త ఉపాధ్యాయులు వర్క్‌ఫోర్స్‌లో చేరడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు మన పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో చారిత్రాత్మక అడుగు వేస్తోంది” అని అన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget