Cm Jagan: విశాఖలో సీఎం జగన్ పర్యటన... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
విశాఖలో పర్యటిస్తోన్న సీఎం జగన్...పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎన్ఏడీ ఫ్లైఓవర్, జీవీఎంసీ స్మార్ట్ సిటీ పార్కును సీం జగన్ ప్రారంభించారు.
విశాఖ పర్యటనలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖలో రూ.150 కోట్లతో నిర్మించిన ఎన్ఏడీ ఫైఓవర్ ను శుక్రవారం సీఎం ప్రారంభించారు. అనంతరం విశాఖ బీచ్‌రోడ్‌లో జీవీఎంసీ స్మార్ట్ సిటీ పార్కును ప్రారంభించారు. ఏయూ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ నెక్కెల నాయుడు బాబు కుమార్తె వివాహ విందుకు సీఎం హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వైజాగ్ కన్వెన్షన్‌లో జరిగిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు పెళ్లి విందుకు సీఎం హాజరయ్యారు. కొత్త దంపతులకు ఆశీర్వదించారు. సీఎం జగన్ తో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ ఉన్నారు. విశాఖలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. రూ.150 కోట్లతో నిర్మించిన ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్‌డీఏ రూ. 36.32 కోట్లతో పూర్తి చేసిన మరో 6 ప్రాజెక్టులను ప్రారంభించారు.
విశాఖ: రూ. 248 కోట్లతో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం.
— YSR Congress Party (@YSRCParty) December 17, 2021
- 150 కోట్లతో నిర్మించిన ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్‌డీఏ రూ. 36.32 కోట్లతో పూర్తి చేసిన మరో 6 ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం.https://t.co/SVlaatpcs1
Also Read: పేదలపై సామాజిక దాడి - బినామీలతో అమరావతి ఉద్యమం .. చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఆగ్రహం !
పీఆర్సీపై రెండో రోజూ సమీక్ష
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ, ఇతర డిమాండ్లపై సీఎం జగన్ వరుసగా రెండో రోజూ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. గురువారం ఉద్యోగ సంఘాల చర్చల వివరాలను మంత్రి బుగ్గన, సజ్జల సీఎంకు వివరించారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్ సహా ఇతర డిమాండ్ల పరిష్కారంపై సీఎం జగన్ రెండు గంటలపాటు చర్చించారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఎంత శాతం, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర సమస్యలపై చర్చించారు. ఫిట్‌మెంట్, ఇతర డిమాండ్ల అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందనే విషయాలు తెలుసుకున్నారు. సోమవారం ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ చర్చించి ఫిట్‌మెంట్ ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగుల ఇతర డిమాండ్ల పరిష్కారంపై సోమవారం సీఎం స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎం వైయస్ జగన్ విశాఖ పర్యటన.
— YSR Congress Party (@YSRCParty) December 17, 2021
- విశాఖలో రూ.247 కోట్ల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ధి ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. https://t.co/MktkbKTa9n
Also Read: అమరావతి మహోద్యమ వేదికపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ... ఏకైక రాజధానికే మద్దతన్న రఘురామ
Also Read: పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి