(Source: ECI/ABP News/ABP Majha)
AP Employees : పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?
ఏపీ ఉద్యోగసంఘం నేతలు తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. పీఆర్సీ ప్రకటిచినా సరే 70 డిమాండ్లు పరిష్కరించేవరకూ ఉద్యమం ఆగదన్ననేతలు .. రాత్రికి రాత్రి విరమణ ప్రకటించేశారు. కనీసం ఫిట్‌మెంట్ కూడా ప్రకటించలేదు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలు ఎవరూ ఊహించని విధంగా ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అప్పటి వరకూ ఒక్క పీఆర్సీ ఇస్తే సరిపోదని సీపీఎస్ రద్దు సహా 70 డిమాండ్లను పరిష్కరిస్తేనే ఉద్యమం విరమిస్తామని ఉద్యోగ నేతలు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అయితే అసలు పీఆర్సీనే ప్రకటించలేదు.. కానీ ఉద్యమాన్ని మాత్రం విరమించేశారు. తాత్కాలికంగా వాయిదా అని చెబుతున్నప్పటికీ.. అసలు ఏ హామీ నెరవేరకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారనేది ఉద్యోగులకు కూడా అంతుబట్టని విషయంగా మారింది.
Also Read: బాలయ్య ఇలాకాలో వైసీపీ నేతల డిష్యుం డిష్యుం! ఇలాగైతే కష్టమే..!
ఉద్యోగులకు ప్రకటించాల్సిన ఫిట్‌మెంట్ ప్రక్రియ ఇంత వరకూ కొలిక్కి రాలేదు. ఆ అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో జరిగే చర్చలు సఫలమైతే ఆ తర్వాత సీఎం జగన్‌తో సమావేశం ఉంటుంది. కానీ ఉద్యోగులు అడుగుతున్న దానికి.. ప్రభుత్వం వైపు నుంచిసానుకూల స్పందన లేదు. ఆర్థిక కారణాల రీత్యా.. ఫిట్‌మెంట్ .. కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసిన దాని కంటే ఒక్క శాతం కూడాపెంచలేమని కానీ ఉన్న జీతం తగ్గకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు. కానీ ఉద్యోగ నేతలు మాత్రం 34 శాతం ఫిట్‌మెంట్ డి్మాండ్ చేస్తున్నారు. కనీసం సానుకూల స్పందనకూడా ప్రభుత్వం వైపు నుంచి రావడం లేదు.
అలాగే మరో అత్యంత కీలకమైన హామీ అయిన సీపీఎస్ రద్దు అంశంలో ప్రభుత్వం పూర్తిగా సాధ్యం కాదని తేల్చేసింది. ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇది ఓ రకంగా ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చేదే. అలాగే కాంట్రాక్ట ఉద్యోగుల క్రమబద్దీకరణతో పాటు ఇతర డిమాండ్లలోదేనిపైనా స్పష్టమైన హామీ రాలేదు. రాతపూర్వకంగా ఇవ్వనూ లేదు. కానీ ఉద్యోగ నేతలు మాత్రం ఉద్యమ విరమణ ప్రకటన చేసేశారు.
నిజానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోయినా ఫిట్‌మెంట్ విషయంలో వచ్చే బుధవారం కార్యదర్శుల కమిటీతో మరోసారి చర్చిస్తామని తెలిపినా... తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ఆర్థిక, ఆర్థికేతర అంశాలకు సంబంధించిన విషయంలో ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని జెఎసి నాయకులు ప్రకటించుకున్నారు. పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళనను వాయిదా వేస్తున్నామని జెఎసి, ఎపిజెఎసి నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పుకొచ్చారు. నిజానికి ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తామనే మొదటి నుంచి చెబుతోంది. ఉద్యమంలోకి వెళ్లక ముందు కూడాఅదే చెప్పింది. కానీ ఉద్యోగ నేతలు మాత్రం దూకుడుగా ముందుకెళ్లారు. ఇప్పుడు వెనక్కి తగ్గి విమర్శలకు గురవుతున్నారు.
Also Read: ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి