By: ABP Desam | Published : 23 Sep 2021 05:02 PM (IST)|Updated : 23 Sep 2021 05:02 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం జగన్(ఫైల్ ఫొటో)
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అక్రమంగా మద్యం తయారీ, రవాణాపైన ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కార్యకలాపాలపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామని సీఎం తెలిపారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాన్ని తీసుకు వచ్చామని, దానిని కఠినంగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
మూడింట ఒక వంతు దుకాణాలు మూసివేత
మద్యం నియంత్రణలో భాగంగా రేట్లు పెంచామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామని, బెల్టుషాపులను, పర్మిట్‌రూమ్‌ల తొలగించామన్నారు. లిక్కర్, బీరు అమ్మకాలు తగ్గాయని పేర్కొన్నారు. లిక్కర్ నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయన్నారు. అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఇసుక ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు
ఇసుకను నిర్దేశించిన రేట్ల కన్నా ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వర్షాలు తగ్గగానే రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్‌ఈబీ కాల్‌సెంటర్ నంబర్‌పై ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్‌చేసేలా ప్రచారం చేయాలని, సంబంధిత జిల్లాల వారీగా ఈ ప్రచారం చేయాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ యాడ్స్ ఇవ్వాలన్నారు. ఎక్కడైనా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
Also Read: AP Govt One Lakh Fine: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్.. రూ.లక్ష జరిమానా విధింపు...
Weather Updates: ఏపీలో మరో 4 రోజులు వానలే! తెలంగాణలో నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన
Petrol-Diesel Price, 17 May: వాహనదారులకు నేడు కాస్త ఊరట! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇక్కడ మాత్రం పైపైకి
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు
Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !
PBKS Vs DC Highlights: టాప్-4కు ఢిల్లీ క్యాపిటల్స్ - కీలక మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం!
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్