Ap Cid: అసైన్డ్ భూముల కుంభకోణం - చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్
Andhra News: అసైన్డ్ భూముల కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రూ.4,400 కోట్ల భూముల స్కామ్ జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది.
Ap Cid Charge Sheet on Chandrababu in Assigned Land Scam: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ (AP Cid) టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రూ.4,400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు పేరును చేర్చిన దర్యాప్తు సంస్థ.. ఆయనతో పాటు మాజీ మంత్రి నారాయణను ముద్దాయిగా పేర్కొంది. రాజధాని అమరావతి పేరిట భారీ భూ దోపిడీ జరిగిందని సీఐడీ ఆరోపించింది. మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్లు పేర్కొన్న సీఐడీ.. క్యాపిటల్ సిటీ ప్లాన్ తో చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసినట్టు నిర్ధారించింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు స్కాం చేశారని పేర్కొంది. చంద్రబాబు, నారాయణతో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ లను ముద్దాయిలుగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.