AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ వాయిదా, జూన్ 24న సమావేశం కానున్న మంత్రి మండలి
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ తాజాగా వాయిదా పడింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జూన్ 24న ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది.
AP Cabinet Meet : ఏపీ మంత్రివర్గ భేటీ ఈ నెల 22న నిర్వహించాలని ఇటీవల ముహూర్తం ఖరారు చేశారు. కానీ ఏపీ కేబినెట్ భేటీ తాజాగా వాయిదా పడింది. జూన్ 24వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
ఇటీవల కొత్త కేబినెట్‌తో తొలి భేటీ
ఏపీ నూతన మంత్రివర్గం మే 12న సమావేశం అయింది. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసే పలు ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యుత్ కోతల నివారణ, మే నెలలో నుంచి నీటి ఎద్దడి, పోలవరం ప్రాజెక్ట్ వంటి విషయాలపై కీలక చర్చ జరిగింది. పరిశ్రమలకు భూముల కేటాయింపులతో పాటు మూడు రాజధానుల ప్రక్రియను వేగవంతం చేయడంపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ చేశారు. సంక్షేమ పథకాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే దిశగా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.