Jagan Kadapa : సీఆర్డీఏను మించి అన్నమయ్య యూడీఏ ! జగన్ సర్కార్ కీలక నిర్ణయం...
కడప జిల్లాలో అతి పెద్ద అర్బన్ డెలవప్‌మెంట్ అధారిటీని ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే అతి పెద్దది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది . ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అమరావతి క్యాపిటల్ రీజియల్ అధారిటీని మించి అతి పెద్ద అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీని నోటిఫై చేసింది.ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉంది. 9వేల చదరపు కిలోమీటర్ల పరిధిని కవర్ చేసే అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీని ప్రభుత్వం ఖరారు చేసింది. దానికి పేరుఅన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంంట్ అధారిటీ . ఈ అన్నమయ్య యూడీఏలో మొత్తం 41 మండలాలు, 520 గ్రామాలు ఉంటాయి. అన్నింటినీ ఒకే రీజియన్‌గా గుర్తిస్తారు.
ఇంత పెద్ద అర్బన్ డెలవప్‌మెంట్ అధారిటీ దేశంలో ఎక్కడా లేదు. చివరికి మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అధారిటీలు కూడా ఇంత పెద్దవి కాదు. హైదరాబాద్, బెంగళూరు కోల్ కతా, ముంబై, చెన్నైల పరిధి కూడా ఇంత భారీగా లేదు. వాటన్నింటికంటే పెద్ద అర్బన్ డెలవప్‌మెంట్ అధారిటీ అన్నమయ్య యూడీఏ. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించిన తర్వాత చంద్రబాబు సీఆర్డీఏను ఏర్పాటు చేశారు. ఈ సీఆర్డీఏ పరిధి కూడా పెద్దదే. ఇది ఏడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఇప్పుడు ఏపీలోనే అంత కంటే పెద్ద యూడీఏను సీఎం జగన్ ఖరారు చేశారు.
నిజానికి అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ కొత్తదేమీ కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్నమయ్య అర్బన్ డెలవప్‌మెంట్ అధారిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. జనవరి 1, 2019న జీవో నెంబర్ 2ని విడుదల చేశారు. అయితే అప్పటి జీవో ప్రకారం యూడీఏ కింద 5392 కిలోమీటర్లను కవర్ చేస్తూ అధారిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన జీవోను జగన్మోహన్ రెడ్డి సవరించి మరింత పరిధి పెంచారు. ఈ కారణంగా సీఆర్డీఏను మించి పోయింది.
Also Read : నెల్లూరులో అమరావతి రైతులకు సర్‌ప్రైజ్.. సంఘిభావం తెలిపిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !
కడప జిల్లాపై తనకు ప్రేమ కాస్త ఎక్కువేనని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. ఈ కోణంలో ఆయన తన సొంత జిల్లాపై ప్రత్యేకశ్రద్ధతో అభివృద్ధి చేయడానికి ఈ అర్బన్ డెలవప్‌మెంట్ అధారిటీని ఖరారు చేశారని అనుకోవచ్చు. మూడు రాజధానులు తప్పనిసరిగా చేస్తామని అంటున్నారు కాబట్టి భవిష్యత్‌లో ఓ రాజధానిగా ఈ అన్నమయ్య అర్బన్ డెలవప్‌మెంట్ అధారిటీ ప్రాంతాన్ని పరిశీలిస్తారేమో వేచి చూడాలి !
Also Read: Omicron Scare: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం సమీక్ష
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి