Omicron Scare: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం సమీక్ష
డిసెంబర్ 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలన్న నిర్ణయంపై కేంద్రం సమీక్ష నిర్వహించనుంది.
అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ప్రభుత్వం ముందుగా అనుకున్నప్పటికీ దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ బయటపడటంతో ఆందోళన నెలకొంది. దీంతో మరోసారి సమీక్ష నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.
అంతర్జాతీయ ప్రయాణికులకు చేయాల్సిన పరీక్షలు, నిఘాకు సంబంధించిన ఎస్ఓపీని కూడా సమీక్షించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగిన అత్యవసర సమావేశంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వైరస్ కట్టడి చర్యలను ఏ విధంగా మెరుగుపరచాలి అనే అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
విమానాశ్రయాలు, ఓడరేవుల్లో టెస్టింగ్ ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఆరోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎమ్హెచ్ఏ.టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆరోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను పెంచాలని స్పష్టం చేసింది.
రాష్ట్రాలకు లేఖ..
- కరోనా కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఈరోజు లేఖ రాసింది. ఈ వేరియంట్‌ను ఆందోళకర వైరస్‌గా డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే ప్రకటించింది. ఈ వేరియంట్ వెలుగుచూసిన దేశాలను ఇప్పటికే 'రిస్క్' కేటగిరిలో పెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ దేశాలను భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరిస్తోంది.
- అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్, వారి కదలికిలపై నిఘా, కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం సహా కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ సూచించారు.
- ఈ వైరస్ వ్యాప్తి అధికమైతే అందుకు తగ్గట్లుగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల కిట్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక టెస్టింగ్ సదుపాయాలను రాష్ట్రాలు దగ్గర పెట్టుకోవాలి.
- హాట్‌స్పాట్‌లను గుర్తించడం తప్పనిసరి. ఎక్కువ కేసులు వచ్చిన క్లస్టర్‌ను గుర్తించి దానిని హాట్‌స్పాట్‌గా ప్రకటించాలి. ఆ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా టెస్టింగ్ చేయడం, పాజిటివ్ శాంపిళ్లను ఇన్సాకాగ్ పరిశోధనశాలకు పంపిచాలి. ఆ ప్రాంతంలో పాజిటివి రేటు ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
- ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం కూడా కీలకం. ఆరోగ్య సేవలను అందించడంలో ఏ మాత్రం ఆలస్యం కాకూడదు.
- దేశంలోని వేరియంట్లను గుర్తించేందుకు ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలను స్థాపించింది ప్రభుత్వం. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి.
- కొవిడ్ వేరియంట్లపై తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించాలి. వ్యాక్సినేషన్ గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి.
Also Read: International News: 'ఆవు.. మహిళ.. ఓ భర్త..' ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ట్విస్ట్ అదిరింది!
Also Read: Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం కీలక సూచనలు.. సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ
Also Read: Covid New Variant: 'దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'
Also Read: Mann Ki Baat: నాకు పవర్ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ
Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి