Breaking News Live: రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా రెండు రోజులుగా నిలిచిన రాజధాని రైతుల మహా పాదయాత్ర నేడు తిరిగి ప్రారంభమైంది. 20వ రోజు రాజధాని రైతుల మహా పాదయాత్ర గుడ్లూరు నుంచి మెుదలైంది. పాదయాత్ర మార్గంలో వాగులు పొంగి పొర్లుతుండటంతో.. అడ్డంకులు ఏర్పడి రెండు రోజుల పాటు విరామం ఇవ్వవలసి వచ్చింది. మహిళలు ఇబ్బందులు పడకూడదనే పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు నేతలు చెప్పారు. నేడు ప్రకాశం జిల్లాలో రైతుల పాదయాత్ర 18 కిలోమీటర్లు సాగుతుంది. సాయంత్రం కావలి మండలం రాజువారి చింతలపల్లిలో రైతులు బస చేస్తారు. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా రాజధాని రైతులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా గుండెపోటుతో చనిపోయారు. మండలి సమావేశాలకు హాజరైన ఆమెకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రెండు రోజులుగా ఆమె శాసనమండలి సమావేశాలకు హాజరవుతున్నారు. శుక్రవారం రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కొద్ది సేపటికి ఆమె ఆరోగ్యం విషమించింది. వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
కరీమున్నీసా విజయవాడ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. విజయవాడ 54వ డివిజన్ కార్పొరేటర్ గా కూడా ఆమె పనిచేశారు. మరోసారి ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ కూడా వేశారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ అనూహ్యంగా కృష్ణా జిల్లా నుంచి కరీమున్నీసాను ఎంపిక చేశారు. దరఖాస్తు చేసుకోకపోయినా సీఎం జగన్ పిలిచి అవకాశం ఇచ్చారని కరీమున్నీసా.. ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కార్పొరేటర్‌గా పోటీ విరమించుకుని ఎమ్మెల్సీ అయ్యారు.
చైన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వానలు ఎక్కువగా పడ్డాయి. బంగాళఖాతంలో గంటకు 18.కీ.మీ వేగంతో కదిలిన వాయుగుండం. పుదుచ్చేరి-చైన్నై మధ్య శుక్రవారం తీరం దాటిందని ఐఎండీ అధికారులు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధి కారులు సూచించారు. వాయుగుండంలో ప్రభావంతో తమిళనాడు, ప్రకాశం చిత్తూరు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలలి సూచించింది.
ఏపీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలిపింది.
చంద్రబాబు కర్మఫలం అనుభవిస్తున్నారు : ఎమ్మెల్యే ద్వారంపూడి
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు వివాదంపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ఎన్టీఆర్ ని ఎంత ఆత్మ క్షోభ పెట్టారో అని వీడియోలను ప్రదర్శించారు. కుప్పం ఓటమితో దిమ్మతిరిగి అసెంబ్లీలో చంద్రబాబు వింత వింతగా ప్రవర్తిస్తున్నారన్న ద్వారంపూడి ఆరోపించారు. ఎన్. టి.రామారావును బాధపెట్టారు కాబట్టి చంద్రబాబు కర్మఫలం అనుభవిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో గెలుపుకోసం బాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు భార్యను వైసీపీ నేతలు ఒక్కరూ ఏమీ అనలేదన్నారు. ప్రజలందరూ చంద్రబాబు ఏడుపు, యాక్షన్ నమ్మరని తెలిపారు.
రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు సీఎం కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. రెండు రోజుల పాటు అక్కడే ఉండి వ్యవసాయ శాఖ మంత్రి, కార్యదర్శితో పాటు ఇతర శాఖల మంత్రులను.. అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని మీడియా సమావేశంలో కేసీఆర్ తెలిపారు. రైతుల మీద పెట్టిన మొత్తం కేసులు ఎత్తివేయాలి- దిశ మీద కేసు ఎత్తివేయాలన్నారు. రైతుల ఉద్యమం ఇలాగే కొనసాగాలని, వారికి అందరూ చేయూత అందించాలన్నారు. సరైన చట్టాలను తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలన్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి మూడు లక్షల రూపాయలు అందిస్తున్నామని చెప్పారు.





















