AP Heat Waves: బీ అలర్ట్ - ఏపీలో 126 మండలాల్లో వడగాల్పులు, అక్కడ మరీ అధికం అని వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ లోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. రాష్ట్రంలోని 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని. .ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వడగాల్పుల అలర్ట్...
రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(04)
అల్లూరి జిల్లా కూనవరం మండలం, కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(126)
అల్లూరి జిల్లాలోని 9 మండలాలు, అనకాపల్లి జిల్లాలోని 14 మండలాలు,
తూర్పు గోదావరి జిల్లాలోని 16 మండలాలు,ఏలూరు జిల్లాలోని 5 మండలాలు,
గుంటూరు జిల్లాలోని 6 మండలాలు,కాకినాడ జిల్లాలోని 12 మండలాలు,
కోనసీమ జిల్లాలోని 1 మండలం,KRISHNA జిల్లాలోని 6 మండలాలు,
ఎన్టీఆర్ జిల్లాలోని 14 మండలాలు,పల్నాడు జిల్లాలోని 1 మండలం,
మన్యం జిల్లాలోని 11 మండలాలు,శ్రీకాకుళం జిల్లాలోని 7 మండలాలు,
విశాఖ పట్టణం జిల్లాలోని 3 మండలాలు,విజయనగరం జిల్లాలోని 18 మండలాలు,వైయస్సార్ జిల్లాలోని 3 మండలాల్లో ,వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందిని వాతావరణ శాఖ పేర్కొంది.మంగళవారంనాడు అనకాపల్లి 5, కాకినాడ 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు(8) ఉంటాయని సూచించింది
అల్లూరి 3, అనకాపల్లి 7, ఏలూరు 4, కాకినాడ 3, కృష్ణా 2, ఎన్టీఆర్, పల్నాడు, విశాఖ, విజయనగరంలో ఒక్కొక్క మండలంలో వడగాల్పులు నమోదయ్యాయని ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హీట్....
రానున్న ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ అదికారులు వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మీదుగా వేడి గాలులు వీచే అవకాశమున్నట్లు చెబుతున్నారు. బాగా ఇంపార్టెంట్ అయిన సమయంలో, తప్పని పరిస్దితుల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రాటం మంచిదని అంటున్నారు. ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణ భారత దేశంలో ఎండలు లేదా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు చేసింది. అంతే కాదు పశ్చిమ్ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
వడగాల్పులు..
ఆంధ్రప్రదేశ్ లో వడగాల్పుల ప్రభావం ఈ ఏడాది తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఇప్పటికే సాదారణ వడగాల్పులు, అధిక వడగాల్పులపై అధికారులు ముందస్తు సమాచారంతో అలర్ట్ చేస్తున్నారు. వేసవి కాలం కావటంతో వాతావరణంలో మార్పులు సాధారణంగా ఉంటాయి. అయితే ప్రతి ఏటా ఎండల తీవ్రత పెరుగుతున్నట్లు గానే ఈ ఎడాది సైతం భానుడి భగ భగలు మరింతగా పెరిగే సూచనలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో మార్పులు వచ్చాయి. సీజన్ ఆరంభంలోనే వర్షాలు పడటం, వాతావరణం చల్లగా మారటంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాల్పులు కూడ వీచాయి. దీంతో రోజులు పెరిగే కొద్ది భానుడి భగ భగలు రికార్డు స్దాయిలో పెరుగుతున్నాయి. వీటితో పాటుగా వేడి గాల్పుల ప్రమాదం ఉండటంతో అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ ముందస్తుగా సూచిస్తోంది.