అన్వేషించండి

అమరావతిలో R5 zone రద్దు.. వైసీపీ హయాంలో ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం

R5 Zone in Amaravati | ఏపీ రాజధాని అమరావతి లో R-5 zone రద్దు చేస్తూ CRDA కీలక నిర్ణయం తీసుకుంది. 2023కి ముందు నిర్ధారించిన విధంగానే R-5 జోన్ ప్రాంతం ఉంటుందని సీఆర్డీఏ స్పష్టం చేసింది.

CRDA Cancels R5 Zone in Amaravati | అమరావతి: రాజధాని అమరావతికి సంబంధించి సీఆర్డీఏ సమావేశంలో ఏపీ  సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఆర్-5 (R5) జోన్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్5 జోన్ కింద కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని, ఇందుకోసం రెవెన్యూ శాఖకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. ఈ జోన్ పరిధిలోకి వచ్చే 1402.58 ఎకరాల భూమిని తిరిగి సీఆర్డీఏ స్వాధీనం చేసుకునేలా తీర్మానించారు. అమరావతి మాస్టర్ ప్లాన్  కాపాడుతూనే, పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

2023 కంటే ముందున్న విధంగానే ఆర్-5 జోన్

గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లను, భూ పంపిణీ ఉత్తర్వులను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. వైసిపి హయాంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల కుటుంబాలకు ఈ ఆర్-5 జోన్ పరిధిలో ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. అయితే, రాజధాని నడిబొడ్డున ఇలాంటి జోన్ ఏర్పాటు చేయడం వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఆర్డీఏ భావించింది. ఈ క్రమంలో అమరావతి రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా 2023 కంటే ముందున్న స్థితిలోనే ఆర్-5 జోన్ ప్రాంతాన్ని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఈ జోన్‌లో ఇప్పటికే ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించింది. వారికి రాజధాని కోర్ ఏరియా వెలుపల, ఆయా జిల్లాల్లోని వేరొక అనువైన చోట ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. తద్వారా అటు పేదలకు ఇళ్ల స్థలాల లబ్ధిని చేకూరుస్తూనే, ఇటు అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించింది. ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పలు ప్రముఖ బ్యాంకులకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్‌ పనులకు అనుమతులు ఇచ్చారు.

పెండింగ్ పనుల టెండర్లకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్..

గత ప్రభుత్వం విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన కుటుంబాలకు ఇళ్ల స్థలాల కోసం సీఆర్డీఏ భూముల కేటాయింపుల వల్ల రాజధాని మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని, అభివృద్ధికి సైతం ఆటంకాలు తలెత్తుతాయని సీఆర్డీఏ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గతంలో బీజేపీ ఆఫీసుకు కేటాయించిన భూమిలో సాంకేతిక కారణాల వల్ల మార్పులు చేస్తూ 1.43 ఎకరాలను వేరే చోట కేటాయించారు. కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేయడంతో పాటు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఎంఈపీ (MEP) పనులకు టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  రాజధాని భూములకు సంబంధించి రెవెన్యూ శాఖ చెల్లించాల్సిన బాకీలు ఉండటంతో, ఆ భూములను తిరిగి సీఆర్డీఏ స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget