YSRCP News : ప్రకాశం మరో నెల్లూరు కాకుండా సీఎం జగన్ జాగ్రత్తలు - పార్టీ నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు !
ప్రకాశం జిల్లా మరో నెల్లూరు కాకుండా సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు.
YSRCP News : ప్రకాశం జిల్లా రాజకీయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా సీరియస్‌గా పరిశీలన చేస్తోంది. ఇప్పటికే నెల్లూరు ఎపిసోడ్ వైసీపీలో కలకలం రేపింది. నెల్లూరులా ప్రకాశం జిల్లా మారకుండా సీఎం జగన్ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల మధ్య విభేధాల పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. బాలినేని ఎపిసోడ్ లో చోటు చేసుకున్న పరిణామాలు పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, పార్టీ వర్గాల నుండి ప్రత్యేకంగా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఇంటలిజెన్స్ తో పాటు ఇతర నివేదికలను కూడా ముఖ్యమంత్రి తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం అవసరం కావడంతో సాక్షి మీడియాతో పాటు ఐ ప్యాక్ టీం, ఇతర మార్గాలు, సన్నిహితల నుండి కూడా పార్టీ వ్యవహారాలపై సీఎం సమాచారం తెలుసుకుంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దాలని అనుకుంటున్నారు.
చేయిదాటిపోయేదా నెల్లూరు విషయంలో జోక్యం చేసుకోకపోవడంతో మైనస్!
ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు ఎపిసోడ్ ఒ కుదుపు కుదిపింది. రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీపై జగన్ పట్టు జారిపోయిందన్న విశ్లేషణలు నెల్లూరులో పార్టీ ఎమ్మెల్యేల ధిక్కరణ ద్వారా వచ్చాయి. ముఖ్యంగా కోటంరెడ్డి తిరుగుబాటు విషయంలో అసలేం జరిగిందో అర్థం కాని పరిస్థితి వైసీపీలో ఉంది. చనిపోతే తన శవం పై కూడా జగనే జెండా కప్పాలంటూ కోటం రెడ్డి చెప్పేవారు. అలాంటి నేత పార్టీ నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో కోటం రెడ్డి బయటకు వెళ్లినప్పటి నుండి వైసీపీపై తీవ్ర స్థాయి పోరాటం చేస్తున్నారు. జగన్ సైతం కోటం రెడ్డి ఎపిసోడ్ పై ఆశ్చర్యానికి గురయ్యారు. పార్టీలో అంతర్గత గొడవల వల్లనే ఇలా జరుగుతోందని చివరికి గుర్తించారు.
ప్రకాశం విషయంలో ముందు జాగ్రత్తలు !
నెల్లూరు జిల్లాలో జరిగినట్లుగా ప్రకారం జిల్లాలో జరగకూడదని జనగ్ భావిస్తున్నాు. ప్రకాశం జిల్లా కూడా మరో నెల్లూరు జిల్లా కావొద్దు అని ముందు జాగ్రత్తలు తీసుకుంటునట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. బాలినేని విషయంలో ఆయన డిమాండ్లు నెరవేరుస్తున్నారు. డీఎస్పీని మార్చేసి.. బాలినేని శ్రీనివాసరెడ్డి అడిగిన వారిని పెట్టారు. ఒకరి నియోజకవర్గాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోకుండా చూసేలా ఒప్పందం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలినేని కంట తడి పెట్టడం.. ఆయన అనుచరులు వైసీపీ జెండాలను పక్కన పడేయడం వైసీపీ హైకమాండ్ ను ఆందోళన గురిచేస్తోంది.
అన్ని పార్టీల నేతలపై పూర్తిస్థాయి నిఘా !
రాజకీయంగా వేగంగా మారిపోతూండటంతో ప్రకాశం జిల్లా రాజకీయాల పై జగన్ స్వయంగా ఆరా తీయటంతో పాటుగా, జిల్లాలోని పరిస్దితులు,తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కదలికల పై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సొంత పార్టీలోని నేతలు ఎవరయినా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా అన్నదికూడా బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించే ధోరణిలో సీఎం లేరనే సందేశాన్ని - పంపేందుకు కూడ జగన్ వెనుకాడటం లేదు.ఇందుకు అవసరం అయిన అన్ని ఏజెన్సీలు సోషల్ మీడియాను క్షేత్ర పరిస్థితు లు పై నాయకుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అందుకే ఎవరైనా టీడీపీతో టచ్ లో ఉంటే వెంటనే వారిని బహిష్కరిస్తారని చెబుతున్నారు.